Breaking News

‘రైతుల ఇబ్బందులు.. సీఎం మాట్లాడే బాష ఇదేనా?’

Published on Fri, 09/05/2025 - 11:46

అనకాపల్లి: ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్‌ విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈనెల తొమ్మిదో తేదీన వైఎస్సార్‌సీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని ఆర్డీవో కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతి పత్రం సమర్పించనున్నట్టు చెప్పారు.

అనకాపల్లి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుడూ..‘సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడు. అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. వైఎస్‌ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు విత్తనం, ఎరువులు అందలేదనే మాట ఎప్పుడూ లేదు. రైతులకు ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం పని చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాం. 15వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను వైఎస్ జగన్ తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.

వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతుల కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నాడు. ఎవరైనా రైతుల కోసం మాట్లాడితే వారిని బెదిరిస్తున్నారు. ఎన్ని ఎకరాల పొలం ఉన్న వారికైనా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. సీజన్‌కి సిద్ధంగా ఉండాలి. సీజన్ అయ్యాక యూరియా ఇస్తానంటే ఎవరికీ కావాలి. ఎవరైనా మాట్లాడితే జైలులో వేస్తానని సీఎం అంటున్నారు. సీఎం మాట్లాడే బాష ఇదేనా?. గతంలో అన్నీ అందుబాటులో పెట్టాం కాబట్టి గతేడాది ఇలాంటి సమస్య రాలేదు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు