Breaking News

వైఎస్‌ జగన్‌ పథకాలపై బాబు కుట్ర: సజ్జల రామకృష్ణారెడ్డి

Published on Mon, 12/09/2024 - 20:41

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలపై చంద్రబాబు కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ  పార్టీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సోమవారం(డిసెంబర్‌ 9) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ఆఫీసు నుంచి పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సజ్జల మాట్లాడారు. టెలీ కాన్ఫరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ సమన్వయకర్తలు,రీజనల్ ఇంఛార్జులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ‘వైఎస్‌ జగన్‌ పథకాలను ఉద్దేశపూర్వకంగా కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాం. ఈనెల 13న రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం.

రైతులతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహిస్తాం. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తాం. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఈ నెల 27న,ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల కోరుతూ జనవరి 3న ధర్నాలు చేస్తాం. సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లలో మగ్గేలా చేస్తోంది. బాధితులకు పార్టీ అండగా ఉంది. వారికి న్యాయ సహాయం అందిస్తూనే ఉంటుంది’అని సజ్జల తెలిపారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)