Breaking News

టీడీపీ గూండాల దౌర్జన్యం.. ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Published on Tue, 05/20/2025 - 11:51

విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆ పార్టీ ప్రతినిధి బృందం మండిపడింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పండుల రవీంద్రబాబు, వ‌రుదు క‌ళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్య నాయకులు విజయవాడలో మరోసారి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి జరిగిన దౌర్జన్యానికి సంబంధించి ఫిర్యాదు చేశారు.

కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు బేఖాతరు చేయని వైనంపై ఆధారాలతో సహా కమిషనర్‌కు వివరించారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించకపోగా, దాడికి పాల్పడిన కూటమి నేతలకు అండగా నిలుస్తూ, వైఎస్సార్‌సీపీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేసిన వైనాన్ని కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. అనంతరం విజయవాడలో మీడియాతో పార్టీ నేతలు మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

పోలీసులే చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు: ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి
ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలిచ్చినా అవి క్షేత్ర‌స్థాయిలో అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. పోలీసులే ఎస్ఈసీ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమ‌ల‌వుతుందా అనే అనుమానం క‌లుగుతోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థ‌ల్లో వైఎస్సార్సీపీకి పూర్తి బ‌లం ఉన్నా, అధికార బ‌లంతో అడ్డ‌దారిలో నెగ్గాల‌ని చూస్తున్నారు. తిరువూరు మున్సిపాలిటీ చైర్మ‌న్ ఎన్నిక విష‌యంలో టీడీపీ అనుస‌రిస్తున్న విధానాలు, పోలీసులు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డంపై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్నిని కలిసి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆమె హామీ ఇచ్చారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉందని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు.  

రాష్ట్రాన్ని బీహార్‌లా మార్చేశారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌న్న త‌లంపుతో ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను తుంగ‌లో తొక్కి అధికార టీడీపీ నాయ‌కులు అరాచ‌కాలు సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా రాజ్యాంగాన్ని, చ‌ట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ నాయ‌కుల‌కు వంత పాడుతున్నారు. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన కౌన్సిల‌ర్ల‌కు స్వేచ్ఛ‌గా ఓటేసుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చిందంటే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌తలు ఎంత‌గా దిగ‌జారిపోయాయో అర్థం చేసుకోవ‌చ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస్ రౌడీ మూక‌ల్ని వెంటేసుకొచ్చి 144 సెక్ష‌న్ ను ఉల్లంఘించి హంగామా చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి స‌హ‌క‌రించారు.

ఎన్నిక సక్ర‌మంగా జ‌రిగేలా చూసుకోవాల్సిన పోలీసులే  మా కౌన్సిల‌ర్ల మెడ‌లో ఉన్న వైయ‌స్సార్సీపీ కండువాల‌ను లాగి ప‌డేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ల‌డం చూసి ప్ర‌జ‌లంతా చీద‌రించుకుంటున్నారు. తిరువూరులో పోలీసులే ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కూట‌మి పాల‌న‌లో ఆంధ్ర రాష్ట్రం బీహార్ క‌న్నా దారుణంగా త‌యార‌వుతోంది. ఇలాంటి సంస్కృతి భావిత‌రాల‌కు మంచిది కాద‌ని గుర్తుంచుకోవాలి. అధికార పార్టీ అరాచ‌కాల‌ను ప్ర‌జాస్వామ్య వాదులంతా  ఖండించాలి.

కోర్టులు, ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలను పట్టించుకోరా?: మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు
చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ప‌చ్చ చొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓటేసేందుకు వెడుతున్న కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన పోలీసులు, తిరువూరు వ‌స్తేనే భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని మాట‌మార్చారు. చ‌ట్ట‌ప‌రంగా న‌డుచుకోవాల్సిందిపోయి అధికార పార్టీ నాయ‌కుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌న్నా, కోర్టుల‌న్నా గౌర‌వం కానీ భ‌యం కానీ క‌నిపించ‌డం లేదు. నిన్న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఇచ్చిన ఆర్డ‌ర్‌ను పోలీసులు పాటించ‌డం లేద‌ని ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. పోలీసులు, క‌లెక్ట‌ర్‌తో మాట్లాడతాన‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని హామీ ఇచ్చారు.

 

తిరువూరు మున్సిపల్ ఎన్నికపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది

ఈ రోజు ఉదయం 11 గంట‌ల‌కు తిరువూరులో ఎన్నిక‌కు హాజ‌రుకావాల్సి ఉంటే, విజ‌య‌వాడ నుంచి వ‌స్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిల‌ర్ల‌ను మార్గమధ్యలో ఎందుకు ఆపేయాల్సి వ‌చ్చిందో పోలీసులే స‌మాధానం చెప్పాలి. మున్సిపాలిటీలో కేవ‌లం ముగ్గురు స‌భ్యుల బ‌లం మాత్ర‌మే ఉన్న టీడీపీ, చైర్మ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవ‌డానికి అడ్డ‌దారులు తొక్కింది. పోలీసుల అండ‌తో ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస్ గూండాలతో వ‌చ్చి మా కౌన్సిల‌ర్లపై దాడికి పాల్ప‌డ్డాడు. పోలీసులే బ‌ల‌వంతంగా న‌లుగురు వైఎస్సార్సీపీ కౌన్సిల‌ర్ల‌ను కిడ్నాప్ చేసి తీసుళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్పించారు.

ఈరోజు కూడా అదే విధంగా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పోలీసులు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌ను సైతం ఉల్లంఘిస్తున్నారు. పోలీసుల వ్య‌వ‌హార‌శైలిపై ఈ రోజు ఉద‌యం వైయ‌స్సార్సీపీ కోర్టును ఆశ్ర‌యించింది. కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశించినా పోలీసులు ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సాక్షాత్తు కోర్టు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ 30 నిమిషాల్లో పూర్తి వివ‌రాల‌తో రిపోర్టు ఇవ్వాల‌ని ఆదేశించింది. అధికారం చేతుల్లో ఉంది క‌దా అని దౌర్జ‌న్యం చేసి మున్సిప‌ల్ చైర్మ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తున్నారు. వీరి ఆట‌లు ఎంతోకాలం సాగ‌వు.  తిరువూరు మున్సిపాలిటీ హాల్ వ‌ర‌కు కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)