Breaking News

‘తప్పు చేశారు కాబట్టే కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నారు’

Published on Tue, 11/25/2025 - 13:51

సాక్షి, తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే రైతులకు మంచి జరిగేదన్నారు పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.  ఇప్పుడు ఆ వ్యవస్థలు లేకనే తుపాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. 

 తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో రైతుల సంక్షేమంపై వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ, తుపాన్‌తో నష్టపోయిన రైతులను చంద్రబాబు ఆదుకోలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు చంద్రబాబు వెళ్తారు?. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకం వల్లే..

.. మాపై విష ప్రచారం చేస్తూనే అబద్ధాలు, మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌ అన్నారు.. ఇప్పటివరకూ ఏమైనా తేలిందా?, సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్‌ పాటించడం లేదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్సార్‌సీపీపై తప్పుడు కేసులు. కుట్ర సిద్ధాంతంతో పాలన చేస్తున్నారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉన్నాయి..

.. చంద్రబాబు అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయి. కానీ, ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులను ఎత్తివేయాలని చూస్తున్నారు. అవినీతి చేయకపోతే చంద్రబాబుకి ఎందుకంత భయం?.  తప్పు చేయనప్పుడు కేసుల్ని ఎదుర్కోవాలి కదా. తప్పు చేశారు కాబట్టే కేసులు వెనక్కి తీసుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాక కేసులన్నీ తిరగతోడతాం. అన్ని కేసులపై పునర్విచారణ చేయిస్తాం’’ అని సజ్జల స్పష్టం చేశారు. 

లిక్కర్ స్కామ్ అన్నారు.. ఇప్పటివరకూ ఏమైనా తేలిందా..?


 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)