Breaking News

చంద్రబాబు గెలిచి ఓడితే.. మేం ఓడి గెలిచాం: వైఎస్‌ జగన్‌

Published on Thu, 11/05/2026 - 17:11

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, చివరకు రాత్రికి రాత్రే పోలింగ్‌ శాతాన్ని కూడా పెంచేసి మరీ గెలుపును తమ ఖాతాలో వేసుకున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గెలిచి ఓడితే.. తాము ఓడి, గెలిచామన్నారు వైఎస్‌ జగన్‌.  ఎన్నికలు సజావుగా సాగితే చంద్రబాబు ఎందుకు గెలుస్తారని ప్రశ్నించారు. 

వీటికి అర్ధం ఏమిటి చంద్రబాబూ..?
‘చంద్రబాబు వీటిని గెలుపుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. విశాఖలో రాత్రికి రాత్రే 1,15,887 ఓట్లు ఎలా పెరిగాయి. సోమవారం ఉదయానికి 1,35,154 ఓట్లు ఎలా పడ్డాయి. రాత్రి 51.46 శాతం అయితే ఉదయానికి 56.03 శాతానికి పెంచారు?. బ్యాలెట్‌ బాక్సుల స్ట్రాంగ్‌ రూమ్‌లకు కూడా సీల్‌ వేయలేదు. 

చీమకుర్తిలో రాత్రి 11 గంటలకు 78.28 శాతం.. రాత్రి 12 గంటలకు పోలింగ్‌ శాతం 84.36 శాతం​ పెంచారు. జమ్మలమడుగులో ఉద‌యం 11గం.లకు 60 శాతం పోలింగ్‌ ఎలా సాధ్యం?, అద్దంకిలో ఉద‌యం 11 గంటలకి 19 శాతం.. మధ్యాహ్నం ఒంటి గంటకు 56 శాతమా?, ధర్మవరంలో 2 గంటల్లో 8 నుంచి 36. 36 శాతానికి ఎలా పెరిగింది?, పార్వతీపురంలో 2 గంటల్లో 12 శాతం నుంచి 44 శాతానికి పెరిగింది?

పోలింగ్‌ శాతాన్ని పెంచి.. రిగ్గింగ్‌ చేశారు. నామినేషన్లు రిగ్గింగ్‌.. స్క్రూటినీ రిగ్గింగ్‌ చేశారు. పోలింగ్‌ బూత్‌ల రిగ్గింగ్‌.. పోలింగ్‌ సైక్లింగ్‌  రిగ్గింగ్‌. పోలింగ్‌ పర్సంటేజ్‌లు.. బ్యాలెట్‌ బాక్సులు సైతం రిగ్గింగ్‌ చేశారు. ఇవన్నీ దాటుకుని మా వాళ్లు గెలిస్తే.. ఆ ఫలితాలను కూడా రిగ్గింగ్‌ చేశారు’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. జెన్‌ జీ తరంలోనూ రిగ్గింగ్‌, సైక్లింగ్‌ ఎలా చేయాలో ట్యూషన్లు పెట్టి మరీ చంద్రబాబు నేర్పించారని ఎద్దేవా చేశారు వైఎస్‌ జగన్‌.

చంద్రబాబు హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఫర్‌ సేల్‌..
చంద్రబాబు హయాంలోనే ఏపీ ఫర్‌ సేల్‌గా మారిపోయింది. ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్‌, గంజాయే. రాజధాని సహా అన్నింటిలోనూ స్కాంలే చేశారు. ఏపీని సౌత్‌ బిహార్‌తో పోలుస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ప్రజల తరఫున బలంగా గొంతు విప్పాం. .చంద్రబాబు అక్రమాల‌ను దేశం దృష్టికి తీసుకెళ్లాం. మా కార్యకర్తలను, నేతల హీరోల్లా పోరాటం చేశారు.. వారికి సెల్యూట్‌’ అని వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరాటాన్ని ప్రశంసించారు. 

మురుసు తుపాన్‌ ఉన్నా ఎన్నికలను వాయిదా వేయలేదు..
‘ఒకవైపు మురసు తుపాన్‌ ఉన్నా ఎన్నికలను వాయిదా వేయలేదు. తుపాన్‌ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రాధాన్యం. అర్నబ్‌ తుపాను కారణంగా 10మందికి పైగా చనిపోయారు. 150 గ్రామాలకు ఇప్పటికీ కరెంట్‌ లేదు.. మురసు తుపాన్‌ కారణంగా ఇద్దరు చనిపోయారు. రైతులు తీవ్రంగా నష్టపోయినా సాయం చేయలేదు. 13 నెలల కింద మోంథా తుపాన్‌ నష్టపరిహారం ఇవ్వలేదు. జీవోలు  ఇచ్చారు కానీ.. డబ్బులు ఇవ్వలేదు’ అని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

LIVE: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

 

ఇదీ చదవండి: మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌
 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)