ఎందుకీ రౌడీ రాజకీయాలు? : వైఎస్‌ జగన్‌

Published on Thu, 08/07/2025 - 05:11

సాక్షి, అమరావతి: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి మండిపడ్డారు. పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌­సీపీ ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నా­నికి పాల్పడ్డాయన్నారు. 

వైఎస్సార్‌సీపీ నాయ­కులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్‌యాదవ్, రామలింగారెడ్డిను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఏం పాపం చేశారని దాడి చేశారు? ఎందుకు ఇలా గాయపరి­చారు? అని ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ఈమేరకు బుధవారం తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘మంగళవారం సాయంత్రం పులివెందులలో జరిగిన మరో ఘటనలో.. ఓ వివాహానికి హాజరైన వైఎస్సా­ర్‌­సీపీ నాయకులపై ఫంక్షన్‌ హాల్‌లోనే టీడీపీ వాళ్లు దాడి చేశారు. 

ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌­రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబో­యిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్‌­రెడ్డి తదితరులను కూడా దారుణంగా కొట్టారు..’ అని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ దాదాపు 100 మందికిపైగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బైండోవర్‌  చేశారు. ఇంకా చాలామందిని బైండోవర్‌ చేసి నిర్బంధించాలని యత్నిస్తున్నారు. ఇంత బరి తెగించి దాడులు చేసిన టీడీపీ వారిపై కేసులు లేవు. అరెస్టులు కూడా లేవు. 

టీడీపీ నుంచి ఒక్కరిని కూడా బైండోవర్‌ చేయలేదు’ అని ధ్వజ­మెత్తారు. ‘మా పార్టీకి చెందిన నాయకుడిని బెదిరించి, భయ­పెట్టి తమవైపు లాక్కుని.. ఆ పార్టీ మారిన వ్యక్తితో  తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. దాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌­రెడ్డి పీఏ రాఘవరెడ్డి, మరో కార్యకర్త గంగాధర్‌రెడ్డిపై పోలీ­సులు మరో తప్పుడు కేసు పెట్టారు..’ అని మండిపడ్డారు. ‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో  హింసను రాజేస్తున్నారు. 

ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ ఎన్నిక జరగ­కూడదని... వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులె­వరూ తిరగకూడదని పోలీసులను ఉపయోగించుకుని చంద్రబాబు ఈ అరాచకాలన్నీ చేయిస్తున్నారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవైపు అక్రమ కేసులు, అరెస్టులు, బైండోవర్లతో పోలీసులు మా పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరిస్తుంటే మరోవైపు టీడీపీ గ్యాంగ్‌లు టార్గెట్‌ చేసి దాడు­లకు పాల్పడుతున్నాయి. ఈ గ్యాంగ్‌లు దాడులు చేసేందుకు వీలుగా ఉద్దేశ పూర్వకంగానే పోలీసులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారు. 



రెండు రోజులుగా వరుసగా దారుణ ఘటన­లకు కారకులైన వారిలో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ప్రాంత డీఐజీ ఈ కుట్రను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక జడ్పీటీసీ స్థానం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారి­పోతారా?’ అని వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. ‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో శాంతి భద్రతలు దిగజారడంతో పాటు పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడం, వ్యవస్థలను నీరుగార్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామ­న్నారు. 

ఈ అంశాన్ని గవర్నర్‌ దృష్టికి తెస్తామని ప్రకటించారు. చంద్రబాబు రౌడీ రాజకీయాలను పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు ఎవరూ సహించరని, ఆయనకు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ‘ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. కళ్లు మూసి తెరిచేసరికి మరో మూడేళ్లు అయిపోతాయి. ఆ తర్వాత మీరు చేసిన ఈ అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయని గుర్తుపెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.   

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)