Breaking News

కిలారు రాజేష్‌ పేరుతో ఎమ్మెల్యే నాని దందాలు

Published on Sun, 07/21/2024 - 06:20

తిరుపతి రూరల్‌ : చంద్రబాబు, లోకేశ్‌కి దగ్గరి వ్యక్తి అయిన కిలారు రాజేష్‌ పేరుతో తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. నాని చర్యలతో అధికారులు, వ్యాపారులంతా భయాందోళనలకు గురవుతున్నారని, ఇలా భయానక వాతావరణం సృష్టించడం చంద్రగిరికి మంచి సంస్కృతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన శనివారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాడ్‌ఫాదర్‌ లాంటి కిలారు రాజేష్‌ తన చెప్పుచేతల్లో ఉన్నాడని, ఎంత చెబితే అంత చేస్తాడంటూ నాని అధికారులు, వ్యాపారులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఆయన, రాజేష్‌ ఉన్న ఫొటోలు, వీడియోలను చూపుతూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారన్నారు. మామూళ్లు ఇవ్వలేదని ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు కిషోర్‌కు చెందిన రైస్‌ మిల్లును మూయించాడని, వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌కు చెందిన రూ.7 కోట్ల విలువైన రెండెకరాల భూమిని కాజేసేందుకు ప్రయతి్నంచారని తెలిపారు.

 అంతేకాకుండా తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పంచాయతీలో రూ.250 కోట్ల విలువైన దేవదాయ శాఖకు చెందిన 10 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పారు. చిత్తూరు నుంచి వంద మంది రౌడీలను తీసుకువచ్చి ఎండోమెంట్‌ అధికారులను బట్టలు విప్పించి, గదిలో బంధించి, మోకాళ్లపై నిలబెట్టి మరీ దాని చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిరి్మంచారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఎండోమెంట్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమే‹Ùనాయుడు జిల్లా కలెక్టర్‌కు, ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారన్నారు.

రోజూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను ఇంటికి పిలిపించుకుని డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. గట్టిగా ప్రశి్నంచిన వారిపై  చిత్తూరు నుంచి రప్పించిన రౌడీ మూకలకు ముసుగులు వేయించి కత్తులు, రాడ్లు, బ్లేడ్‌లతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. నాని దందాలు, ఆక్రమణలపైనా విచారణ చేయించాలని అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)