Breaking News

వైఎస్‌ జగన్‌ పేదల పక్షపాతి, సంక్షేమ సారథి: చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

Published on Sat, 12/21/2024 - 13:08

సాక్షి, ప్రకాశం: ఏపీలో ప్రజల మద్దతుతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడానికి కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ.. పేదల పక్షపాతి, సంక్షేమ సారధి అయిన వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మద్దతుతో వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్‌ జగన్‌ను సీఎం చేసే వరకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ చుండూరి  రవిబాబులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన కార్యక్రమానికి కార్యకర్తల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.

మరోవైపు.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాకాల మండలంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌, దివంగత సీఎం  వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం ఉన్నా,  లేకున్నా ప్రజల పక్షనా వైఎస్సార్‌సీపీ నిలుస్తుంది. కూటమి  ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. హామీల అమలు చేయకపోతే పాకాల నుంచే పోరాటాలు ప్రారంభిస్తాం. కూటమి నాయకుల దౌర్జన్యాలకు సరైన గుణపాఠం నేర్పుతాం అని హెచ్చరించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)