Breaking News

‘తిరుపతిలో భూ ఆక్రమణలు.. బాబు, బీఆర్‌ నాయుడికి బాధ్యత లేదా?’

Published on Sun, 08/24/2025 - 12:56

సాక్షి, తిరుపతి: తిరుపతిలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. బీఆర్‌ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో భూ భాగోతానికి తెరతీశారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆలయానికి సంబంధించిన భూమి టూరిజానికి ఇవ్వడం నేరం. ఆలయ భూములను టూరిజానికి కట్టబెట్టడంపై మేము అభ్యంతరం తెలిపాం. అత్యంత విలువైన భూమి అన్యాక్రాంతం అవుతోంది. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?.

టీటీడీ ల్యాండ్‌ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారు?. బీఆర్‌ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు. ఇది పూర్తిగా ధర్మం మీద దాడి. వాణిజ్య అవసరాలకు దేవుడి భూమిని వాడుకుంటారా?. అత్యంత పవిత్రమైన టీటీడీ ల్యాండ్‌ టూరిజానికి ఇవ్వడమేంటి?. మరెక్కడో ఉన్న ప్రభుత్వ భూమిని ఇవొచ్చు కదా?. టీటీడీ బోర్డు మీటింగ్‌లో మా అభ్యంతరాలను తిరస్కరించారు. 

మే నెల ఏడో తేదీన జరిగిన బోర్డు మీటింగ్‌లో ఆగ మేఘాలపై సమావేశం నిర్వహించారు. అలిపిరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో టూరిజం భూమి తీసుకుని టూరిజంకు బదలాయించారు. 05.08.25 క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదంతో 07.08.25 జీవో ఇచ్చారు. అత్యంత విలువైన స్థలం ఇవ్వడంపై నేను కూడా అభ్యంతరం వ్యక్తం చేశాను. అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఆసుపత్రి మధ్య ప్రాంతం 20 ఎకరాలు 1500 కోట్ల విలువైన స్థలం ఇచ్చారు. ఆ విలువైన 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్ కు ఇవ్వాలని చూస్తున్నారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలంలో రెవెన్యూ భూమి ఇవ్వొచ్చు కదా. మంత్రి రాసలీలలు గురించి మాట్లాడిన టీడీపీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పారు. నేను ఏ ఒక్క విషయం వక్రీకరించలేదు. టీడీపీ నేత సుధాకర్ రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు ఉంది అని వ్యాఖ్యలు చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)