వచ్చే నెల 9వ తేదీన వైఎస్సార్‌సీపీ బీసీ రణభేరి

Published on Thu, 07/23/2026 - 17:52

తాడేపల్లి : వచ్చే నెల 9వ తేదీన విజయవాడలో వైఎస్సార్‌సీపీ బీసీ రణభేరి నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పష్టం చేశారు. ఈ రణభేరిలో బీసీలపై చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు చర్చిస్తామన్నారు.  వైఎస్సార్‌సీపీ బీసీ నేతలను ఈ ప్రభుత్వం వేధిస్తుందని, చంద్రబాబు బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు జోగి రమేష్‌. బీసీల ఐక్యత చాటేలా ఈ రణభేరి ఉంటుందన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో బలహీన వర్గాలు నడవాల్సిన అవసరం ఉందన్నారు.

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం(జూలై 23వ తేదీన) మీడియా సమావేశంలో మాట్లాడిన జోగి రమేష్‌..  బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని జగన్ నిరూపించారన్నారు. సామాజిక న్యాయం జగన్‌తోనే సాధ్యమని, ఆయన మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయే టైం దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు జోగి రమేష్‌.

సూపర్ సిక్స్ పేరుతో సూపర్ మోసం చేశారు
చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ పేరుతో సూపర్‌ మోసం చేశారని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మరీ ముఖ్యంగా బీసీలతో ఓట్లేయించుకుని వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ‘ బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అన్నమాటలు ఎవరూ మర్చిపోలేదు. వైఎస్సార్ సీపీలోని బీసీ నేతలందరినీ టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. గంటూరులోనూ బీసీ మహిళను వివస్త్రతను చేసి అవమానపరిచారు. నాపై పది అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఇలాంటివి ఎన్నైనా ఎదుర్కొంటాం. బీసీలందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)