Breaking News

‘జగనైక’ విజయం 2.0...రేసుగుర్రాలు ‘సిద్ధం’

Published on Sun, 03/17/2024 - 04:14

సాక్షి,అమరావతి: సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ చేసి చూపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే స్పష్టం చేసిన ఆయన అదే నినాదాన్ని అక్షరసత్యం చేశారు. 50 శాతం సీట్లు బడుగు బలహీనవర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు  కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. ఈ నిర్ణయం అనన్య­సామాన్యం.. అనితర సాధ్యం. ఇది ఇప్పటివరకు ఎవరూ సాహసించని అరుదైన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతోంది.

ఒక్క అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం మినహా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు శనివారం ఇడుపులపాయ వేదికగా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పవిత్ర సమాధి సాక్షిగా వైఎస్సార్‌ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. జనబ­లమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్‌ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు.  మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు. 

టీడీపీ అగ్రజులపై బీసీల పోటీ 
కుప్పంలో చంద్రబాబుపై వన్నికుల క్షత్రియకు చెందిన కేఆర్‌జే భరత్, మంగళగిరిలో నారా లోకేశ్‌పై పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణపై కురుబ సామాజిక వర్గానికి చెందిన టీజీఎన్‌ దీపిక పోటీకి దిగుతున్నారు. వీరు ముగ్గురూ బీసీలే కావటం విశేషం.  

గత ఎన్నికల్లోనూ బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం 
గత ఎన్నికల్లోనూ ప్రాధాన్యం వైఎస్సార్‌ సీపీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చింది.  ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 41 శాసనసభ స్థానాల్లో అవకాశం కల్పించింది. ఇందులో మహిళలకు 15, మైనార్టీలకు 5 స్థానాల్లో అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల కంటే ఇప్పుడు శాసనసభ స్థానాల్లో మహిళలకు నాలుగు, మైనార్టీలకు రెండు స్థానాలు అదనంగా కేటాయించింది. పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 7 లోక్‌సభ స్థానాల్లో సీఎం జగన్‌ అవకాశం ఇచ్చారు.

గత ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల్లో మహిళలకు నాలుగు చోట్ల అవకాశం కల్పిస్తే ఇప్పుడు ఐదు నియోజకవర్గాలు కేటాయించారు. సామాజిక న్యాయం, జనులకు సుపరిపాలనే లక్ష్యంగా సీఎం జగన్‌ అభ్యర్థులను ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తునూ పణంగా పెట్టి ఇంతలా బీసీల కోసం నిలబడిన నేత మరొకరు లేరని శ్లాఘి­సు­్తన్నారు. డబ్బు, పొత్తులు, ఎత్తులను నమ్ముకొని ఎన్నికల క్షేత్రానికి వచ్చే టీడీపీ, బీజేపీ, జనసేన లాంటి పెట్టిబడి పార్టీలకు సీఎం జగన్‌ నిర్ణయం గొడ్డలిపెట్టు అని మేధావులు అభివర్ణిస్తున్నారు.

ప్రతిపక్ష కూటమి బీసీలకు ఇచ్చింది 25 సీట్లే 
వైఎస్సార్‌ సీపీ బీసీలకు 48 సీట్లు కేటాయిస్తే ఇప్పటివరకు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, అందులో బీసీలకు కేవలం 25 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు.   

సీఎం చెప్పారంటే.. చేస్తారంతే.. 
సీఎం జగన్‌ చెప్పారంటే ... చెస్తారంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య ఓ సభలో మాట్లాడుతూ ‘‘సీఎం జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమస్యలు ఏవైనా ఉంటే తక్షణం పరిష్కారానికి పూనుకునే వారు. ఇప్పుడు సీఎం జగన్‌ కూడా బీసీలు, మహిళలు, పేదల ఉజ్వల భవిత కోసం పరితపిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాల సాధికారత దిశగా కృషి చేస్తున్నారు. ఆయన చెప్పిందే చేస్తున్నారు.

ఆయన వెంట నడవాల్సిన బాధ్యత మన బీసీలతోపాటు అన్ని కులాలు, అన్నివర్గాలపైనా ఉంది.  2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, బీజేపీ ప్రలోభాలకు లొంగవద్దు’’ అన్నారు. ఇప్పుడు కృష్ణయ్య మాటలను నిజం చేస్తూ సీఎం జగన్‌ అభ్యర్థుల ప్రకటనల్లో బీసీలకు, మహిళలకు పూర్తి న్యాయం చేశారు. కనుక ఇక వైఎస్సార్‌సీపీకి మద్దతునిచ్చే బాధ్యత బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపైనే ఉందనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)