Breaking News

కృష్ణవేణిని అరెస్ట్‌ చేసి.. దాచేపల్లి సీఐ వేధింపులు: అంబటి

Published on Sat, 04/19/2025 - 12:14

సాక్షి, గుంటూరు: ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్ట్‌ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి? అని ప్రశ్నించారు.

సోషల్ మీడియా కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాకత్ ద్వారా పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం, మాజీ అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌.. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్‌లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు.

కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్‌ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట. కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్‌కు రాకుండా సీఐ స్టేషన్ గేట్లకు బేడీలు వేశాడు. తనను సీఐ భాస్కర్ వేధించారని కృష్ణవేణి మేజిస్ట్రేట్‌కి వాంగ్మూలం ఇచ్చింది. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

సీమ రాజా, కిరాక్ ఆర్పీ.. మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలు. మాపైన అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు సీమ రాజా, కిరాక్ ఆర్పీపై మేము పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసులు కట్టరు. వాళ్లని లోకేష్‌ పోషిస్తున్నాడు కనుక వాళ్లపై కేసులు కట్టడం లేదు. గతంలో పెద్దిరెడ్డి సుధారాణిని 50 రోజులకు పైగా జైలుకు పంపారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని సీఐ తనను హింసించాడని కృష్ణవేణి చెప్తోంది. మహిళల జోలికి వస్తే ఒప్పుకోనని చెప్పే చంద్రబాబు ఇప్పుడేం చేస్తాడో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)