Breaking News

హారికను అనకూడని మాటలు అన్నారు: వైఎస్‌ జగన్‌

Published on Wed, 07/16/2025 - 11:57

సాక్షి, గుంటూరు: రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులపై నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి అవగాహన లేదా? అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో.. గుడివాడ జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక దాడి ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా?. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, మీటింగ్‌లు పెట్టుకోవడం.. ఇవన్నీ హక్కులే కదా. మరి రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులు నలభై ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబుకి తెలీదా? అని జగన్‌ ప్రశ్నించారు.

గుడివాడలో దాడిని రాష్ట్రం మొత్తం చూసింది. మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి చేశారు. బీసీ మహిళ ఉప్పాల హారికపై దాడి దుర్మార్గం. నా సోదరి హారిక మీద టీడీపీ సైకోలు దాడి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటే.. పోలీసుల సమక్షంలో ఇది జరిగింది. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఒక బీసీ మహిళకు ఆత్మగౌరవం లేదా?.. ఇంతమంది సైకోలుగా, శాడిస్టులుగా ప్రవర్తిస్తారా?.. పథకం పన్ని నా చెల్లి హారికపై చేసిన దాడి దుర్మార్గం.

హరికను అనకూడని మాటలు అన్నారు. మళ్లీ మహానటి అంటూ ఆమెనే ఎద్దేవా చేస్తున్నారు. దానవీరశూరకర్ణ కంటే గొప్పగా నటించేంది చంద్రబాబే. స్పష్టంగా ఆధారాలు ఉంటే ఎంత మంది మీద కేసు పెట్టారు?. తిరిగి హారిక భర్త రాము మీదే తప్పుడు కేసు పెట్టారు. చంద్రబాబు ఈ విషయమై అడుగుతున్నా.. పెడనలో సభ పెట్టిన వైఎస్సార్‌సీపీ నేతలందరిపై కేసు పెట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంకా ఎక్కడైనా ఉన్నామా?. చంద్రబాబు చేసే ప్రతిపనిలో డైవర్షన్‌ పాలిటిక్సే అని జగన్‌ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)