Breaking News

ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్‌ జగన్‌ లీగల్‌ నోటీసులు

Published on Sat, 11/30/2024 - 19:01

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్‌ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్‌ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్ర­జ్యోతి పత్రికలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు శనివారం లీగల్‌ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్‌ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్‌ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. 

సెకీ ఐఎస్‌టీఎస్‌ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్‌ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 
 


ఈ కథనాల వల్ల తమ క్లయింటు ప్రతిష్ట దెబ్బ తింటుందని ముందే తెలిసి, అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రచురించారని తెలిపారు. ఈ మేరకు ఉషోదయ ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పబ్లిషర్‌తో పాటు ఈనాడు ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పబ్లిషర్‌తో పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ ఎన్‌.రాహుల్‌ కుమార్‌లకు వైఎస్‌ జగన్‌ తరఫు న్యాయవాదులు లీగల్‌ నోటీసు పంపారు.

ఇదీ చదవండి: సెకితో ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన వైఎస్‌ జగన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)