Breaking News

సీఈసీ నియామకంపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

Published on Sun, 10/18/2026 - 13:05

సాక్షి, తాడేపల్లి: సీఈసీ నియామకంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీజేఐ నేతృత్వంలో సీఈసీ నియామకం జరగాలని.. కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌లో సంస్కరణలు తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశంలోని వ్యవస్థల్లో మార్పురావాలి.. రాష్ట్రంలోనూ ఎస్‌ఈసీ నియామక విధానంలో మార్పు రావాలన్నారు.

‘‘2024 ఎన్నికల్లోనూ ఫలితాలు తారుమారయ్యాయి. దాన్ని నేను ఆనాడే ప్రస్తావించాను. కోర్టులకూ కొందరు వెళ్లారు. కానీ వ్యవస్థలో మార్పులు రానంత కాలం మనం ఏమీ చేయలేము. ఎస్‌ఈసీ, సీఈసీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం సరికాదు. దానికి నాడు మేం కూడా సమర్థించాం. అందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాం. విద్యార్థులే ఎగ్జామినర్‌ను నియమించినట్లుగా ఉంటుంది.

..సీఈసీ ఎంపిక విధానం ఇప్పుడున్నది సరికాదు. నాడు సమర్థించాం. ఆ తప్పు చేశాం. వ్యవస్థలో మార్పు రావాలి. సీఈసీ. ఎస్‌ఈసీ లో మార్పులు రావాలి. ఎస్‌ఈసీ నియామకం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేయొద్దు. ఎస్‌ఈసీని హైకోర్టు సీజే, విపక్షనేత, సీఎం కలిసి నిర్ణయించాలి. సీఈసీని సీజేఐ, విపక్షనేత, పీఎం కలిసి నిర్ణయించాలి. అంతేకానీ, వారి నియామకాలు ఏకపక్షంగా ఉండకూడదు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

’’ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా నాడు చంద్రబాబు హయాంలో చీఫ్‌ సెక్రటరీ. సీఎస్‌గా అనిల్‌ చంద్ర పునేఠా విధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విధుల నుంచి తొలగించింది. అలాంటి అనిల్‌ చంద్ర పునేఠా పదవీ విరమణ చేసినా.. చంద్రబాబు ఆయన్ను ఇప్పుడు ఎస్‌ఈసీగా తీసుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్‌ చంద్ర పునేఠా చంద్రబాబుకు వీరవిధేయుడు. చంద్రబాబు ఏం చెబితే పునేఠా అది చేస్తున్నారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఇదీ  చదవండి: పార్టనర్‌ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్‌ జగన్‌

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)