Breaking News

కామిరెడ్డి నానిని ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌

Published on Wed, 09/03/2025 - 20:36

సాక్షి, తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్‌ కామిరెడ్డి నానిపై టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో ఆయన ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు, టీడీపీ గూండాలు ఎలా దాడిచేశారనేది కామిరెడ్డి నాని.. వైఎస్‌ జగన్‌కు వివరించారు. తనపై దాడి తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడకు కూడా వచ్చి దాడి చేశారని నాని చెప్పారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైఎస్‌ జగన్‌ సూచించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైఎస్‌ జగన్‌ తీవ్రంగా మండిపడ్డారు.

ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. నానికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్‌ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)