Breaking News

వైఎస్‌ జగన్‌ పర్యటన.. వివాదాస్పదంగా పోలీసుల తీరు

Published on Wed, 07/09/2025 - 18:08

సాక్షి,చిత్తూరు : వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వైఎస్ జగన్‌ పర్యటనలో సెక్యూరిటీని వదిలేసి కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు ఉన్నతధికారులు పనిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డును సందర్శించారు. మామిడి రైతుల్ని పరామర్శించారు. వారికి తానున్నాననే భరోసా కల్పించారు. 

అయితే,ఈ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న జగన్‌కు భద్రత కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. వైఎస్‌ జగన్ పర్యటనను ముగ్గురు ఎస్పీలు, రేంజి ఐజీ ఆసాంతం ఫాలో అయ్యారు. కానీ జగన్ మామిడి యార్డులోకి వెళ్లేసరికి పోలీసులు సెక్యూరిటీ కనుచూపుమేరలో కనిపించలేదు. జగన్ రైతులను కలిసేందుకు వెళ్తుంటే అడుగు ముందుకు పడడం కష్టమైంది.

అదే సమయంలో వైఎస్‌ జగన్‌ పర్యటనకు జనాన్ని రానీయకుండా చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఓ సీఐ కార్యకర్త తల పగులకొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. పరామర్శించేందుకు వెళ్లబోయిన మాజీ సీఎంను కారు దిగనీయకుండా ఎస్పీ మణికంఠ అడ్డుపడ్డారు. ఆ తర్వాత కూడా జనాన్ని రానీయకుండా పోలీసులు కుట్ర చేయడం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)