Breaking News

అబద్ధాల కాంపిటీషన్‌లో బాబుతో పోటీపడలేకపోయాం: వైఎస్‌ జగన్‌

Published on Thu, 10/03/2024 - 15:33

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వేధింపులు మనల్ని ఏమీ చేయలేవని అన్నారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ వేధింపులు, కేసులు మనకు తాత్కాలికం మాత్రమేనని తెలిపారు.ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దేవుడు అన్ని విషయాలు చూస్తున్నాడు అనేందుకు తిరుమల లడ్డూ వివాదం ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. 

బాబుకు దేవుడే మొట్టికాయలు వేశాడు..
లడ్డూ విషయంలో విష ప్రచారం చేశారని, వారి ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని గోబెల్స్‌ ప్రచారాలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారని, ఆ అబద్ధాన్ని మార్కెటింగ్‌ చేసి అమ్మేయగల సమర్థులని విమర్శలు గుప్పించారు. అయినా లడ్డూ వ్యవహారంలో గట్టిగా నిలబడి ప్రజలకు వాస్తవాలు వివరించగలిగామని తెలిపారు. చివరకు చంద్రబాబుకు దేవుడే మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

విచ్చలవిడిగా  జూదం, క్లబ్బులు
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, నాయకులతో వైఎస్‌ జగన్‌ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందని ధ్వజమెత్తారు.  ప్రతి గ్రామంలో, నియోజకవర్గాల్లో జూదం, క్లబ్బులు నడుస్తున్నాయని మండిపడ్డారు. ఇసుక, మద్యంల్లో స్కాంలు నడుస్తున్నాయని, స్టాక్‌యార్డుల్లో పెట్టిన ఇసుక మాయం అయిపోయిందని విమర్శలు గుప్పించారు. మొత్తం స్టాకుయార్డుల్లో నిల్వలను లూటీ చేశారన్న ఆయన.. ఇప్పుడు ఇసుక ఎక్కడ దొరకడం లేదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఇసుక ధర కన్నా ఇప్పుడు ధర చాలా ఎక్కువ ఉందన్నారు.

మద్యం షాపుల నుంచి ఎమ్మెల్యేలకు వాటాలు..
‘ప.గో. జిల్లాకు చెందిన నాయకులే చెప్తున్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో టన్నుకు రూ. 550లు అయితే, ఇప్పుడు రూ.1375కు అమ్ముతున్నారని చెప్తున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఎవరి జేబుల్లోకి డబ్బు పోతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులకే మద్యం షాపులు కట్టబెడుతున్నారు. ఈ షాపులనుంచి ఎమ్మెల్యేలకు వాటాలు, ఆపై వాళ్లకు వాటాలు. గ్రామ, గ్రామాన బెల్డు షాపులు వస్తున్నాయి.

మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు
ఐదేళ్ల పరిపాలనా కాలంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఆ మంచి ఇంకా బతికే ఉంది. జగన్‌ మంచే చేశాడు.. చెడు చేయలేదన్న మాటే ప్రతిచోటా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అబద్ధాల కాంపిటీషన్‌లో చంద్రబాబుతో పోటీపడలేకపోయాం. చంద్రబాబు చెప్పినట్టుగా జగన్‌ చెప్పలేకపోయాడు. చంద్రబాబులా జగన్‌కూడా హామీలు ఇవ్వాలన్నట్టుగా చాలామంది ఎదురుచూశారు. కాినీ, ఇవాళ పరిస్థితులను మీరంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్‌కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత, విలువలు లేకపోతే ప్రజల్లో చులకన అవుతాం. మనం ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ఇకపై కూడా తలెత్తుకునే రాజకీయాలు చేస్తాం.

ప.గో.జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పార్టీ మారినా, జడ్పీటీసీలు కలిసికట్టుగా నిలబడ్డారు. వారి పోరాట స్ఫూర్తికి అభినందనలు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత మీరు చూపారు. జడ్పీటీసీలు అందరికీ కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం చాలామందికి ఆదర్శనీయంగా నిలిచింది. ఎప్పుడూ చీకటి మాత్రమే ఉండదు, వెలుగు తప్పకుండా వస్తుంది. ప్రజల తరఫున పోరాటాలు చేయండి, ప్రజల పక్షాన నిలబడండి. ఇందులో వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు వైఎస్‌ జగన్‌.

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)