Breaking News

మాజీ సీఎం చంద్రబాబు విచక్షణతో మాట్లాడాలి

Published on Tue, 04/30/2024 - 04:05

వేంపల్లె : మాజీ సీఎం చంద్రబాబునాయుడు విచక్షణతో మాట్లాడాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ అన్నారు. వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. ఆమె సోమవారం వైఎస్సార్‌ జిల్లా వేంపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను చంపితే ఏం చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వయసులో పెద్దవారని, ప్రజా జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు. 

ఇలాంటి ఆలోచనలు మంచివి కావన్నారు. విశాఖ, విజయవాడల్లో జరిగిన హత్యా­యత్నాల లాంటి ఘటనలను ప్రేరేపించడం దారుణమన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని మాట్లాడే వాళ్లకు కళ్లు లేవని అనుకుంటున్నానని అన్నారు. కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని చెప్పారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, మహిళలు అందరూ జగన్‌ను వారి పెద్ద కొడుకని, నెలనెలా ఇం­టికి డబ్బు ఇస్తున్నాడని తన ఎన్నికల ప్ర­చారం సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

 ఐదేళ్లకు ముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటి ముంగిట సమస్యలు ఉన్నాయని, మాకు అవి రాలేదు ఇవి రాలేదని చెప్పేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా­మని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటామని ప్రజలంతా చెప్పారన్నారు. సంక్షేమ పథకాలు చాలా బాగా అందుతున్నాయని ప్రజ­లు చెబుతుండటంతో ఆనందంగా ఉందన్నా­రు.  కార్యక్రమంలో శాసనమండలి మాజీ డి­ప్యూ­టీ చైర్మన్‌ సతీ‹Ùకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మిగాయత్రి, సర్పంచ్‌ శ్రీనివాసులు  పాల్గొన్నారు.  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)