Breaking News

‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే టార్గెట్‌.. మొత్తం టీడీపీ బ్యాచ్‌ పులివెందులలోనే ఉంది’

Published on Wed, 08/06/2025 - 12:49

సాక్షి, పులివెందుల: పులివెందులలో ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే టీడీపీ అసహనానికి గురైంది. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టం​గా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ పేరుతో ప్రజలకు నిండా ముంచారు. ఉప ఎన్నికల్లో గెలివలేరని కూటమికి అర్థమైంది. అందుకే కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త పెళ్లికి వెళ్తే దాడి చేశారు. వాళ్లపై కేసులు నమోదైనా.. మరోసారి దాడికి యత్నించారు. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కూటమి కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకులను కావాలనే బైండోవర్‌ చేస్తున్నారు.

ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా?. పులివెందుల ప్రజలు ఎంతో తెలివైన వాళ్లు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌ రెడ్డిని గెలిపిస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు సంయమనం పాటించాలి. పోలీసులు బెదిరించి మరీ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ అంటూ స్టేషన్‌కు తరలించారు. ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ నమోదు చేశారు. ఇలా ఈ రెండు రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్‌ చేశారు అని ఆరోపించారు.   

పులివెందులలో ఆగని టీడీపీ గూండాల అరాచకాలు

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)