నువ్వు ఒక్కడివే.. నీకు ఛాన్స్‌ లేదు.. బయటికి పోండి

Published on Wed, 07/23/2025 - 15:31

సాక్షి, నెల్లూరు: జిల్లా సమీక్ష మండలి సమావేశం(డీఆర్‌సీ) సమావేశం రాజకీయ రగడకు దారి తీసింది. కరేడు రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడే ప్రయత్నం చేయగా.. మంత్రులు ఆనం, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ఆయన్ని అడ్డుకుని అవమానకర రీతిలో మాట్లాడారు. 

కరేడు రైతుల సమస్యపై బుధవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కరేడులో భూ సేకరణపై వివరణ ఇవ్వాలని, ఎంత భూములు సేకరిస్తున్నారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రశ్నించారు. అయితే మాధవరావును మాట్లాడనీయకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో మీడియాపై చిందులేస్తూ బయటకు వెళ్లిపొమ్మంటూ ఊగిపోయారు.

ఆ సమయంలో మంత్రి ఆనం కలుగజేసుకున్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా.. ఎమ్మెల్సీకి అవకాశం లేదని, అవసరమైతే బయటకు వెళ్లిపోవాలని కటువుగా సూచించారు. ఆ సమయంలో మరో మంత్రి నారాయణ కూడా వేదిక మీదే ఉన్నారు.  దీంతో మాధవరావు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.

‘‘సమస్యలపై గళమెత్తడానికి రాజకీయ అనుభవం అవసరం లేదు. శాసనమండలి సభ్యుడుగా సమస్యలపై గళమెత్తడానికి నాకు హక్కు ఉంది. మంత్రి రామనారాయణరెడ్డి ఎమ్మెల్సీలు మాట్లాడేందుకు అర్హత లేదు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఇండో సోల్ కంపెనీకి గతంలో మేము 5,000 ఎకరాల కేటాయించాము. ఈ ప్రభుత్వం 8,000 ఎకరాలు కావాలంటుంది. ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి

ఇటీవల రెండు గ్రామాల్ని తరలించేందుకు 2000 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పచ్చటి పొలాలను గ్రామాలను కదిలించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. గ్రామాలకు గ్రామాలను పరిశ్రమల పేరుతో ఖాళీ చేయించడం ఘోరం. 3000 కుటుంబాలను పరిశ్రమల పేరుతో రోడ్డుకి ఈడ్చడం సబబు కాదు. ‘కరేడు రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుంది’’ అని అన్నారాయన.

DRC సమావేశంలో సోమిరెడ్డి ఓవర్ యాక్షన్...

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)