Breaking News

వాస్తవం తెలుసుకోండి.. బీజేపీ తప్పుడు ప్రచారంపై సచిన్ పైలట్ ఫైర్‌

Published on Wed, 08/16/2023 - 10:12

జైపూర్: బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్‌లో సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీలపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ కలిసి 1966, మార్చి 5న మిజోరాం ఐజ్వాల్‌లో బాంబు దాడి జరిపారని అన్నారు. అందుకు సచిన్ పైలట్ స్పందిస్తూ మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమే కానీ మీరు చెప్పిన డేట్లు, సమాచారం తప్పని ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవ్య ట్వట్టర్‌లో రాస్తూ.. "1966, మార్చిలో రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ ప్లేన్‌లో మిజోరాం రాజధాని ఐజ్వాల్‌పై బాంబుల వర్షం కురిపించారు. తదనంతర కాలంలో వారిద్దరికీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్లు ఇచ్చి మంత్రులుగా కూడా చేర్చుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సొంత ప్రజలపై దాడులు చేసినందుకు కానుకగా ఇందిరా గాంధీ వారికి ఆ పదవులు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది" అని రాశారు.   

అమిత్ మాలవ్య చేసిన వ్యాఖ్యలకు సచిన్ పైలట్ బదులిస్తూ.. "మీ దగ్గర తప్పుడు తేదీలు.. తప్పుడు సమాచారముంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమే కానీ అది తూర్పు పాకిస్తాన్ పైన అదికూడా 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా జరిగింది. మీరు చెప్పినట్టు 1966, మార్చి 5న మిజోరంపై కాదు. ఎందుకంటే ఆయన 1966, అక్టోబరు 29న విధుల్లో చేరారు. జై హింద్.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు." అని రాసి కింద తన తండ్రి రాజేష్ పైలట్ జాయినింగ్ డేటు ఉన్న సర్టిఫికేటును జతపరిచారు. 

ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్‌దళ్‌ కార్యకర్త అరెస్టు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)