Breaking News

‘20 ఏళ్లుగా అనుకుంటున్నా.. కానీ రాహుల్ అనుకోలేదు’

Published on Thu, 03/06/2025 - 20:02

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ ఎంతగానో సేవ చేసిన తనను పార్టీ  ప్రస్తుతం గుర్తించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మణి శంకర్ మళ్లీ పెదవి విప్పారు. పార్టీకి ఇంకా సేవ చేద్దామని ఉన్నా తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తానొక వృద్ధుడిని అని పక్కన పెట్టేశారని, తాను మరీ అంత వృద్ధుడినేమీ కాదన్నారు 83 ఏళ్ల మణిశంకర్ అయ్యర్‌. జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మణి శంకర్ అయ్యర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.‘

 ఇప్పుడు నేనేమీ మాట్లాడినా బీజేపీ వక్రీకరిస్తుంది. వారు కచ్చితంగా ఆ పని చేస్తారు. మీతో మాట్లాడిన దానిని వక్రీకరిస్తారు. కానివ్వండి.. వారు అలా చేస్తే మనం చేసేదేమీ ఉండదు..  మా  పార్టీలోని పవన్ ఖారే నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. నా సేవలు పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పేశారు. ఏ రకంగానే నా సేవలు అవసరం లేదన్నారు. 

ఇక ‘గాంధీ’ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ షిప్ పై మణి శంకర్ అయ్యర్ స్పందించారు. ‘ మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. వారు నన్నేమీ శత్రవుగా చూడటం లేదు. కానీ రాహుల్ గాంధీ.. నన్ను బాగా వృద్ధుడిగా చూస్తున్నారు. నేను వృద్ధుడ్నే కానీ.. మీరు అనుకునేంత వృద్ధుడ్ని కాదు. ఇదే వారు నన్ను సంప్రదించకపోవడానికి ప్రధాన కారణం’ అని చెప్పుకొచ్చారు.

ఇక రాహుల్ గాంధీకి మెంటార్ గా వ్యవహరిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. మణిశంకర్ అయ్యర్ తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘ రాహుల్ కు మెంటార్ గా ఉండాలని గత 20 ఏళ్లగా సిద్ధంగా ఉ‍న్నా. కానీ వారు నన్ను కోరుకోవడం లేదు. నా అభిప్రాయాన్ని వారు మీద నేను బలవంతంగా రుద్దలేను కదా.  నేను ఉండాలని కోరుకుంటున్నా. కానీ రాహుల్ అనుకోవడం లేదు’ అని అ‍న్నారు. కాంగ్రెస్ లో కొంతమంది తనపై లేనిపోనివి చెప్పి తనను వారి నుంచి దూరం చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు అయ్యర్.

మరి ఈ విషయాల్ని రాహుల్ గాంధీ సమక్షంలోనే నివృత్తి చేసుకోవచ్చు కదా అని అడిగిన మరో ప్రశ్నకు అయ్యర్ బదులిస్తూ..  ‘ నేను ఎలా కలుస్తాను.. వారు కలిసే అవకాశం ఇవ్వకపోతే నేను కలవగలను. 2004లొ రాహుల్ నా మాట గౌరవం ఇచ్చేవారు. ఆ సందర్భంలో మీరు నా తండ్రికి  స్నేహితుడు.. అందుకు మీ మాట వింటాను.. మా తండ్రి మీ మాట విన్నారు.. నేను కూడా మీ మాట వింటాను’ అని ఒకానొక సందర్భంలో సంగతిని అయ్యర్ గుర్తు చేసుకున్నారు. 

ఇప్పుడు వారిని కలిసే పరిస్థితి లేదన్నారు. వారే తనను దూరం పెడుతున్నారన‍్నారు. అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎవర్నీ నేను కలవలేకపోతున్నా.  సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేకపోయినా కలవడానికి లేకుండా ఉంది. నేను వారు గురించి ఎందుకు డిస్టర్బ్ కావాలి. నాకేమైనా ఇప్పుడు ఎంపీ పోస్ట్ కోసం వారిని కలవాలా? ఏంటీ, అని అయ్యర్  తిరిగి ప్రశ్నించారు. 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)