Breaking News

బియ్యపు గింజపై ‘ఓటు వేయండి’!

Published on Sat, 04/13/2024 - 07:50

దేశంలో లోకసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగున్నాయి. వివిధ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే జనం చేతిలో ఓటు అనే అయుధం ఉంది. దీనితో వారు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తుంటుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఒక హస్త కళాకారిణి వినూత్న రీతిలో ఓటు హక్కుకున్న ప్రాముఖ్యత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.  

జైపూర్‌లోని సాంగనేర్‌ నివాసి నీరూ చాబ్రా ప్రజలకు ఓటుహక్కు ప్రాముఖ్యతను తెలియజేయాలని భావించారు. ఇందుకోసం ఆమె బియ్యపుగింజలపై ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ రాశారు.  ఆమె బియ్యపు గింజపై భారత మ్యాప్‌ను సూక్ష్మ శైలిలో గీయడంతోపాటు ఎన్నికల స్లోగన్‌ కూడా రాశారు. 

ఈ సందర్భంగా నీరూ చాబ్రా మీడియాతో మాట్లాడుతూ 1984 నుంచి తాను బియ్యపు గింజపై సూక్ష్మ అక్షరాలు రాయడాన్ని కొనసాగిస్తున్నానని, కిచెన్‌లో వంట చేసేటప్పుడు తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు. మెల్లమెల్లగా ఈ కళలో ప్రావీణ్యం సంపాదించానని అన్నారు. కాగా నీరూ బియ్యపు గింజపై 108 అక్షరాలు రాసి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తదితరులు నీరూ చాబ్రా ప్రతిభను గతంలో మెచ్చుకున్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)