Breaking News

కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే పూర్తి బాధ్యత నాదే: ఖర్గే

Published on Fri, 05/05/2023 - 18:01

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే సమయం ఉంది. ఈనేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కన్నడనాట కాంగ్రెస్ ఓడిపోతే అందుకు పూర్తి నైతిక బాధ్యత తనదే అన్నారు. ఈమేరకు ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఎన్నికలకు స్టార్‌ క్యాంపెయినర్‌గా కూడా ఖర్గే ఉన్నారు.

అయితే కర్ణాటకలో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తామన్నారు. ఈసారి హంగ్ వచ్చే పరిస్థితి ఉండదన్నారు. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ కృత నిశ్ఛయంతో ఉందని, తీరక లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు.

'నేను రోజు నాలుగు ర్యాలీల్లో పాల్గొంటున్నా. ఒక్కోసారి 100కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. బీజేపీని ఎలాగైనా ఓడించాలని అకింతభావంతో ఉన్నాం. అందుకే ఎన్ని సవాళ్లనైనా అధిగమిస్తున్నాం.' అని ఖర్గే వ్యాఖ్యానించారు.

కాగా.. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13 కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. పలు సర్వేలు ఈసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఇప్పటికే తెలిపాయి. మరి ఓటర్ల నాడి ఎలా ఉందో వారం రోజుల తర్వాత తేలిపోనుంది.
చదవండి: వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి మద్దతు తెలిపిన మోదీ..

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు