Breaking News

ఆ వ్యాఖ్యల్లో అర్థం ఇదేనా ?.. సీఎం మార్పు ఖాయమేనా?

Published on Mon, 06/30/2025 - 20:15

బెంగళూరులో తొక్కిసలాట ఘటన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందా?, కర్ణాటకలో సీఎంను మార్చాలా? అనేది ఇప్పుడు కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీవ్రంగా చర్చిస్తున్న అంశం. మరొకవైపు తొక్కిసలాట ఘటన పేరుతో డీకే శివకుమార్‌ను సీఎం చేయడానికి రంగం సిద్ధమైందా? అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ హైకమాండ్‌ నుంచి ఎటువంటి ప్రకటనా నేరుగా రాకపోయినప్పటికీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

కర్ణాటకలో సీఎంను మార్చబోతున్నారా? అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే డైరెక్ట్‌గా ఏమీ చెప్పలేకపోయారు.  ఆయన నో అనే అవకాశం ఉన్నా కూడా ‘ అంతా హైకమాండ్‌ చేతుల్లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. 

ఇక్కడ హైకమాండ్‌ అంటే తానే అనే విషయం మరిచిపోయి ఖర్గే ఇలా వ్యాఖ్యానించినప్పటికీ కర్ణాటక కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఏదో జరుగబోతుందనే సంకేతాలిచ్చారు ఖర్గే.  మీడియా అడిగిన దానికి.. ‘ఇప్పుడు కర్ణాటకలో సీఎంను మార్చాల్సిన అవసరం ఏమిటి?’ అని చెప్పకుండా, అంతా హైకమాండ్‌ చేతుల్లో ఉంది అనడం త్వరలో ఏదో జరగబోతుందనే దాన్ని బలపరిచింది.

డీకే శివకుమార్‌కు చాన్స్‌..? 
అక్కడ ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పిస్తే, ఆ తర్వాత రేసులో ఉన్నది డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌కే అవకాశం దక్కుతుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో డీకే శివకుమార్‌ సీఎం అనే ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్‌ మాత్రం సిద్ధరామయ్యనే సీఎంను చేసింది. కర్ణాటకలో ఎటువంటి మార్పులు లేకుండా సీనియర్‌ అయిన సిద్ధరామయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పట్నుంచి డీకే శివకుమార్‌, సిద్ధరామయ్యల మధ్య కాస్త దూరం పెరిగిందనేది జనాల్లో వినిపిస్తున్న మాట. అయితే సిద్ధరామయ్య కోసం తన చివరి శ్వాస వరకూ నిలబడతా అనే వ్యాఖ్య కూడా డీకే శివకుమార్‌ ఒకానొక సందర్భంలో చేసి తమ మధ్య ఏమీ విభేదాల్లేవని సంకేతాలిచ్చారు. 

ఈ ఏడాది శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది.  ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే డీకే శివకుమార్‌ తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా తాను చివరి శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానని తేల్చి చెప్పారు.

మరింత పటిష్టం చేసే దిశగా పావులు..!
కర్ణాటకలో కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేసి.. బీజేపీకి ధీటుగా నిలబడాలంటే డీకే శివకుమార్‌ సీఎం పగ్గాలు అప్పజెప్పాలని గత కొద్దికాలంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే ఆలోచన చేసే దిశగా ముందుగా సాగుతున్నట్లు ఖర్గే వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)