Breaking News

ఓటమి భయంతోనే వివేకానంద దాడి

Published on Fri, 10/27/2023 - 04:05

కుత్బుల్లాపూర్‌: ఓడిపోతామనే భయం, అసహ నంతోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద బీజే పీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై దాడి చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.  ఓ న్యూస్‌ చానల్‌ నిర్వహించిన ఎన్నికల చర్చలో వివేకానంద, శ్రీశైలంగౌడ్‌ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  గురువారం శ్రీశైలంగౌడ్‌ను షాపూర్‌నగర్‌లోని నివాసంలో సంజయ్‌ పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడు తూ బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడు తున్నారని.. తమ సహనాన్ని చేతగాని తనంగా భావించొద్దని హెచ్చరించారు. ’’పేరేమో వివేకానంద కానీ చేష్టలేమో ఔరంగజేబును తలపిస్తున్నా యని’ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేని ఉద్దేశించి విమర్శించారు. భౌతిక దాడులు జరిగే అవకాశముందని ముందే సమాచారం వచ్చినా పోలీసులు  ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని సంజయ్‌ ప్రశ్నించారు.

బీజేపీ అభ్యర్ధి కూన శ్రీశైలంగౌడ్‌కు ఎందుకు భద్రత ఇవ్వడం లేదని నిలదీశారు. వివేకానందను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)