Breaking News

స్మృతి ఇరానీకి చుక్కలు చూపించిన కేఎల్ శర్మ ఎవరు?

Published on Tue, 06/04/2024 - 13:36

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఓట్ల ఆధిక్యంతో స్మృతీ ఇరానికి చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం,  దూకుడుతనం, ఎన్నికల ప్రచారం కేఎల్ శర్మకు కలసివచ్చే అంశాలుగా పరిణమించాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేఎల్ శర్మ బ్యాక్‌ గ్రౌండ్‌ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.

కెఎల్ శర్మకు గాంధీ కుటుంబంతో పాత పరిచయం ఉంది.  చాలా కాలంగా రాయ్‌బరేలీలో  ఉంటూ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా శర్మ వ్యవహరిస్తున్నారు. పార్టీ  కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించే ఆయన గాంధీ కుటుంబపు ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషిస్తుంటారు. కెఎల్ శర్మ రాజీవ్ గాంధీకి కూడా అత్యంత సన్నిహితునిగా పేరొందారు.

కేఎల్‌ శర్మ అమేథీలో 1983, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో పాటుపడ్డారు. 1999లో సోనియా గాంధీ మొదటి ఎన్నికల ప్రచారంలో కూడా శర్మ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి కారణంగానే అమేథీలో సోనియా విజయం సాధించారని చెబుతారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు. మరి ఇప్పుడు కెఎల్ శర్మ  ఎటువంటి ఫలితాలు రాబడతారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)