Breaking News

మహా అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్‌ కీలక వ్యాఖ్యలు

Published on Fri, 08/16/2024 - 13:59

ముంబై: మహారాష్ట్రలో ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై శివసేన(ఉద్దవ్‌ వర్గం) అధినేత ఉద్దవ్‌ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరైనా సరే శివసేన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎంవీయే భాగస్వామ్యాలైన కాంగ్రెస్‌, ఎన్సీపీ శరద్‌పవార్‌ ప్రకటించిన అభ్యర్ధికి భేషరతుగా మద్దతిస్తామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర అత్మగౌరవాన్ని కాపాడే పోరాటమని పేర్కొన్నారు.

‘ఎంవీఏ కూటమిలో సీఎం అభ్యర్థిపై  ఊహాగానాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ చవాన్ అయినా, శరద్ పవార్ అయినా సరే, కూటమిలోని నేతలందరూ తాము సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారో వారి పేర్లను ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి నిర్ణయానికి నేను పూర్తి మద్దతు ఇస్తాను’ అని తెలిపారు.

అదే విధంగా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ప్రచారం ప్రారంభించాలని ఎంవీఏ భాగస్వాములను ఆయన కోరారు. 'ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే వారికే సీఎం పదవి దక్కుతుందనే నిబంధనను మేం పాటించాం. ఇంతకుముందు పొత్తుల్లో కూడా ఇదే ఫార్ములాను అనుసరించాం. కాబట్టి ముందుగా సీఎం ముఖాన్ని ప్రకటించాలని, ఆ తర్వాతే ప్రచారాన్ని ప్రారంభించగలమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రత్యర్థి శివసేన వర్గానికి పార్టీ గుర్తు వెళ్లిపోవడంపై స్పందిస్తూ.. వాల్లు  నా'విల్లు-బాణం' గుర్తును దొంగిలించినప్పటికీ, నేను వారి వెన్నుముకకు నిప్పు పెట్టడానికి 'లైటింగ్ టార్చ్'ని గుర్తుగా ఎంచుకున్నాను’ అని చెప్పారు..

కాగా 2022లో శివసేనను చీల్చుతూ ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే షిండే వర్గానికి అత్యధిక ఎమ్మెల్యేల బలం ఉండటంతో గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం 'శివసేన' పార్టీ పేరును, దాని విల్లు, బాణం గుర్తును కేటాయించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)