Breaking News

‘ప్రచార బుల్లెట్‌’ ఎక్కిన బెంగాల్‌ బీజేపీ చీఫ్‌

Published on Mon, 03/11/2024 - 11:45

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్  (TMC) అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుల్లెట్‌ వాహనంపై బాలూర్‌ఘాట్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. 

సోమవారం ఉదయం 7 గంటలకు బాలూర్‌ఘాట్‌ రైల్వేస్టేషన్‌లో రైలు దిగిన మజుందార్‌కు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకుల నినాదాల మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల మేర మోటర్ సైకిల్ నడుపుతూ మజుందార్ ప్రచారం నిర్వహించారు . మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎంసీపై పలు విమర్శలు చేశారు. ‘ఓ వైపు ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తుంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. తృణమూల్ ఇక్కడి నుంచి అనేక కుంభకోణాలు చేసిన దొంగను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది దొంగలు, మంచి వ్యక్తుల మధ్య పోరు. తృణమూల్ కాంగ్రెస్ ఈ నియోజకవర్గాన్ని మోసం చేసింది’ అన్నారు.

బాలూర్‌ఘాట్ నియోజకవర్గం నుండి టీఎంసీ తన లోక్‌సభ అభ్యర్థిగా బిప్లబ్ మిత్రను నిలబెట్టింది. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది.

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)