Breaking News

‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’

Published on Thu, 05/29/2025 - 17:30

కోల్‌కతా:  ప్రధాని నరేంద్ర మోదీ  పశ్చిమబెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వమని, హింసాత్మక ప్రభుత్వమని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రజలు.. మమతా బెనర్జీ ప్రభుత్వం అరాచకాలపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ప్రజల భావనగా ఉందని మోదీ తెలిపారు.

దీనికి సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో జవాబిచ్చారు. తాను ప్రధాని మోదీ తరహాలో వ్యాఖ్యానించలేనంటూనే  వచ్చే  ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు.  రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అనేది తేలుతుందని మోదీకి సవాల్ విసిరారు.  మోదీ వ్యాఖ్యలపై కౌంటర్ రిప్లై  ఇచ్చిన మమతా.. ‘ ఎన్నికలు రానివ్వండి.  చూద్దాం.. ఎవరి సత్తా ఏమిటో తేలుతుంది. ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారో చూద్దాం. మా వెంట, మా పార్టీ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లో చూస్కుందాం’ అని మోదీకి మమతా సవాల్‌ విసిరారు.

ఈరోజు(గురువారం)  ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్దౌర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. పశ్చిమ బెంగాల్ ఎక్కడ చూసినా అవినీతి, అల్లర్లు, హింస ఇవే కనిపిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏప్రిల్ నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)