Breaking News

పరకాల: ఆసక్తిగా పరకాల పోరు!

Published on Tue, 08/22/2023 - 13:52

పరకాల అంటే ఉద్యమాల ఖిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలో పరకాల కీలక భూమిక పోషించింది. మరో జలియన్ వాలా బాగ్‌గా పెరొందింది. దీంతో పరకాలలో అమరధామం నిర్మించారు. నియోజకవర్గానికి తలమానికంగా సంగెం మండలం మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 

రాజకీయపరమైన అంశాలు : 

పరకాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్‌కు చెందిన చల్లా దర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి, 2015లో బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో  బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖపై గెలుపొందారు. కొండా సురేఖ సైతం ఒకసారి గెలుపొందారు. తెలంగాణ  ఉద్యమం నేపథ్యంలో కొండ సురేఖ రాజీనామా చేయగా ఉత్పన్నమైన ఉపఎన్నికలో సురేఖ ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం సురేఖ వరంగల్ తూర్పుతో పాటు పరకాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నాగూర్ల వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నప్పటికి ఇటీవల కేటిఆర్ పరకాల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయనకే టిక్కెట్ కన్‌ఫాం చేసింది అధిష్టానం. బీజేపీ నుంచి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు.

ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : 

  • అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్  
  • నిరుద్యోగం  
  • డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 
  • దళిత బంధు  
  • ధరణి పోర్టల్   

ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : 

బీఆర్ఎస్

  • చల్లా ధర్మారెడ్డి (కన్‌ఫాం)

కాంగ్రెస్ 

  • కొండ సురేఖ (ఆశావాహులు)
  • ఇనుగాల వెంకట్రామిరెడ్డి  (ఆశావాహులు)

బీజేపీ పార్టీ

  • పెసరు విజయచందర్ రెడ్డి  (ఆశావాహులు)
  • గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి   (ఆశావాహులు)

వృత్తిపరంగా ఓటర్లు 

  • మేజారిటీ ఓటర్లు రైతులు. 
  • వ్యాపారులు. 

మతం/కులం పరంగా ఓటర్లు

హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కులం పరంగా చూస్తే బిసిలు 141369 మంది ఓటర్లు, ఎస్సీలు 47854 మంది ఓటర్లు, ఎస్టీలు 10308 మంది ఓటర్లు, ముస్లీంమైనార్టీ ఓటర్లు 8279 మంది ఉన్నారు.

నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు :

పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉంది.

  • చలివాగు ఉంది
  • చంద్రగిరిగుట్టలు 
  • చెన్నకేశవ స్వామి జాతర 
  • కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)