Breaking News

ఓరుగల్లు పశ్చిమంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పొలిటికల్ హీట్..!

Published on Tue, 05/02/2023 - 21:05

ఓరుగల్లు నగరం పశ్చిమంలో ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వేసవి ఎండలతో పాటు పొలిటికల్ హీట్‌ కూడా తీవ్రంగా పెరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఇక్కడ పోటీ పడుతున్నదెవరు? వారి పరిస్థితేంటి? 

వరంగల్ నగరం పశ్చిమ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పొలిటికల్ వార్ జరుగుతోంది. దాస్యం వినయ్‌భాస్కర్ అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించిన వినయ్‌భాస్కర్ ఐదో సారి కూడా గులాబీ జెండా ఎగరేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి కూడా గెలిచేది నేనే అంటూ ధీమాగా ఉన్నారాయన. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగుతానంటున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్‌ రెడ్డి ఎలాగైనా ఈసారి దాస్యంకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. నాలుగుసార్లు గెలిచి నగరానికి ఏం చేశావని ఐదోసారి గెలిపించాలని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళుతున్నారు నాయిని.

తొలినుంచీ ఉత్తర దక్షిణ ధృవాలుగా కొనసాగుతున్న దాస్యం వినయ్‌భాస్కర్, నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండగా..వీరి అనుచరులు కూడా అదే రేంజ్‌లో ఒకరిపై  ఒకరు విరుచుకుపడుతున్నారు. కరపత్రాలు, ప్లెక్సీ పోస్టర్లతో రాజకీయ విమర్శలు చేసుకుంటూనే..ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దాస్యం వినయ్ భాస్కర్ పై చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్‌కు హనుమకొండ బిఆర్ఎస్ ముఖ్యనాయకులు ఫిర్యాదు చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
చదవండి: ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్.. హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందా?

కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు సైతం వాగ్ధాటి పెంచారు. ప్రజల సమస్యలు పరిష్కరించి..అభివృద్ధి చేస్తాడని దాస్యంను గెలిపిస్తే ఎమ్మెల్యేగా చేసింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూకబ్జాలు, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకుంటూ  అభివృద్దిని గాలికొదిలేసి వచ్చిన అభివృద్ధి  నిధులను ఖర్చు చేయలేని నిస్సహాయ స్థితికి చేరారని ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌ సెల్ కు వచ్చే ఫిర్యాదుల్లో 70శాతం బిఆర్ఎస్ నేతల భూ కబ్జాలపైనే ఉంటున్నాయని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ తరపున నాయిని రాజేందర్ రెడ్డి బరిలో నిలబడితే గులాబీ పార్టీ అభ్యర్థి వినయ్ భాస్కర్ ఓడిపోవడం ఖాయమంటూ ప్రచారం సాగిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీల తరుపున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేది తామే అటు దాస్యం, ఇటు నాయిని చెప్పుకుంటున్నారు. ఎవరికి వారే ఎదుటి వారి లోపాల్ని ఎత్తి చూపుతూ..పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దాదాపు సమానంగా వచ్చినట్లు సమాచారం. సర్వే తర్వాతే ఇరువురు నేతలు పోటీపడి విమర్శలు గుప్పించుకుంటూ..ప్రజాబలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ప్రత్యర్థిని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలడంలేదని చెబుతున్నారు.
చదవండి: గులాబీ బాస్‌నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్‌ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది?

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)