Breaking News

‘ఏపీలో వార్‌ వన్‌ సైడే.. YSRCPదే గెలుపు’

Published on Thu, 05/16/2024 - 12:57

విశాఖపట్నం, సాక్షి: పోలింగ్‌ పర్సంటేజ్‌ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అంటున్నారు. గురువారం విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  

‘‘ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు.  గ్రామీణ ఓటర్లు మన పార్టీ వైపే నిలబడ్డారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్ధికే ప్రజలు ఓటేసి పట్టం కట్టబోతున్నారు.. 

..గతంలో ఓటింగ్‌ పెరిగినప్పుడు కూడా  ఉన్న ప్రభుత్వాలే గెలిచిన దాఖలాలు ఉన్నాయి.  గతంలో.. మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్సార్‌ ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా సీఎం జగన్‌ విజయం సాధిస్తారు. గతంలో కంటే వైఎస్సార్‌సీపీకి ఎక్కువ సీట్లే వస్తాయి. 

.. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. అందుకే వార్‌ వన్‌సైడ్‌ కాబోతోంది. ఏకపక్షంగా విజయం సాధించబోతున్నాం. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కాబోతున్నారు. 

.. ప్రతిపక్ష పార్టీలు ప్రెస్టేషన్ లో గొడవలకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు తాము చేస్తున్న అల్లర్లకు, హింసకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. కేంద్రంలో  ఏ పార్టీకి, కూటమికి మెజారిటీ రాకూడదు. మన పార్టీల అవసరం వాళ్లకు పడాలి. పనికిమాలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమనండి’’ అంటూ అమర్నాథ్‌ ప్రసంగించారు.

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)