Breaking News

సీఎం నితీశ్‌ కుమార్‌కు బిగ్‌ షాక్‌

Published on Sat, 04/05/2025 - 08:52

పాట్నా: బీహార్‌లో ముఖ్యమంత్రి నితిశ్‌ కుమార్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బీహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. తాజాగా మరో కీలక నాయకుడు నదీమ్‌ అక్తర్‌ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో, ఎన్నికలకు ముందు బీహార్‌లో జేడీయూకు ఎదురుదెబ్బ తగిలింది.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఉభయసభల్లో మద్దతు తెలుపుతూ ఓటింగ్‌లో పాల్గొన్నాయి. ఈ ‍క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షమైన నితీష్ కుమార్ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ఓటు వేయడంతో.. ఆ పార్టీలోని మైనార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత నదీమ్‌ అక్తర్ పార్టీకి రాజీనామా చేశారు. అంతకంటే ముందు.. జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ షానవాజ్ మాలిక్, అలీఘర్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తబ్రేజ్ సిద్ధిఖీ, భోజ్‌పూర్‌కు చెందిన సభ్యుడు మొహమ్మద్ దిల్షాన్ రైన్, మాజీ అభ్యర్థి మొహమ్మద్ ఖాసిం అన్సారీ, రాజు నయ్యర్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీహార్‌లో ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో వరుసగా నేతలు రాజీనామా చేస్తుండటంతో జేడీయూ ముస్లిం ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయమని ఆ రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. తబ్రేజ్ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత నితీష్ కుమార్‌కి పంపారు. బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింల విశ్వాసాన్ని దెబ్బతీశారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘మీరు మీ లౌకిక ఇమేజ్‌ను కొనసాగిస్తారని నేను ఆశించాను, కానీ ముస్లింలకు వ్యతిరేకంగా పదేపదే పనిచేసిన శక్తులతో నిలబడాలని మీరు ఎంచుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ , పౌరసత్వ సవరణ చట్టం వంటి చర్యల తర్వాత ఏన్డీయే ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని, ఇది ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. ఎన్డీయే మరో మిత్రపక్షమైన ఆర్ఎల్డీలో కూడా ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఆర్ఎల్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాజాయిబ్ రిజ్వి శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ జయంత్ చౌదరి.. లౌకికవాదాన్ని విడిచిపెట్టారని, ముస్లింలకు మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు. ముస్లింలు జయంత్ చౌదరికి మద్దతు ఇచ్చారని, కానీ ఈ సమయంలో మాతో నిలబడలేదని రిజ్వీ అన్నారు. దీంతో, వక్ఫ్‌ సవరణ బిల్లును ఎన్డీయే మిత్రపక్ష పార్టీల్లో అగ్గి రాజేసింది. అసంతృప్తి నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు