Breaking News

మనసు పెడితే మార్గం ఉంటుంది

Published on Sat, 04/13/2024 - 08:16

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి ఉన్నత విద్యావంతురాలు. 2006లో బొబ్బిలి లోక్‌సభ సభ్యురాలిగా, 2009లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న ఆమె.. 2009లోనే ‘విశాఖ విజన్‌’ పేరిట నగర అభివృద్ధిపై ఆమె పార్లమెంట్‌లో పలుమార్లు ప్రస్తావించారు.దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ నగరం ఒకటి. భవిష్యత్తులో ఇలాంటి నగరంలో తాగునీటి సమస్యలు రాకుండా ఉండేలా ముందుచూపుతో 2009లో లోక్‌సభలో బొత్స ఝాన్సీ లక్ష్మి వినూత్న ఆలోచన చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు. 

తాగునీటి సమస్యకు చెక్‌ చెప్పేందుకు మంచినీటి ఎద్దడిపై అప్పటి కేంద్ర  ప్రభుత్వాలు దృష్టి సారించాలని పార్లమెంటులో పట్టుబట్టడం ఆమెకే చెల్లింది. సముద్ర జలాలను తాగునీటి వినియోగార్థం మార్చే డిశాలీనేషన్‌ ప్రాజెక్ట్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తే..ఆంధ్ర తీర ప్రాంతం నీటి కష్టాలను నెరవేర్చగలదని లోక్‌ సభలో గళమెత్తారు. 2007లో ఎప్రిల్‌ 27వ తేదీన పార్లమెంటులో 368 నెంబర్‌ స్టారెడ్‌ క్వశ్చన్‌ సంధించారు. దేశంలోనే అతి పెద్ద తీరరేఖ పొడవు 927 కి.మీ ఉన్న ఏపీలో తాగునీటి సమస్య లేకుండా ఉండాలంటే దీనికి శాశ్వత పరిష్కారం డిశాలీనేషన్‌ ప్రాజెక్ట్‌ అని వివరించారు.

 దీనికి అప్పటి కేంద్ర మంత్రి అజయ్‌ మాకెన్‌ సమాధానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నేరుగా త్రాగునీటి అంశాన్ని చూడకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతిపాదనలతో నిధులు కేటాయిస్తామని సమాధానం చెప్పడం జరిగింది. భీమిలి మున్సిపాలిటీ పరిధిలో 2.86 ఎంఎల్‌డి నీటి ప్రాజెక్ట్‌ కు కేంద్ర సహకారం ఉంటుందని సమాధానమిచ్చారు. రూ.185 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ప్రజావసరాలను నెరవేర్చడంలో ఎటువంటి శషభిషలకు పోకుండా పార్లమెంటులో ఝాన్సీలక్ష్మి ప్రయత్నానికి నాడు ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు.  

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)