Breaking News

దస్తగిరిది ఎంత క్రిమినల్‌ మైండ్‌ అంటే..

Published on Sat, 03/02/2024 - 14:20

వైఎస్సార్‌, సాక్షి: వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుకా పెద్ద కుట్ర దాగి ఉందని.. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడని అంటున్నారు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తనయుడు డా.చైతన్యరెడ్డి. ఈ కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలపై.. దస్తగిరి చేసిన ఆరోపణలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.  

దస‍్తగిరి ఎవరి డైరెక్షన్‌లో మాట్లాడుతున్నాడో అందరికీ అర్థమవుతోంది. చంద్రబాబు చెప్పడం.. సునీత చెప్పడం.. దస్తగిరి ఆరోపణలు చేయడం. ఈ డ్రామాలు, కథలు ఇప్పటివి కాదు. కేసు మొదటి నుంచి అతను అబద్ధాలే చెబుతున్నాడు. దస్తగిరి అంత క్రిమినల్‌ మైండ్‌ ఎవరికీ లేదు. ఇదంతా మా నాన్న(శంకర్‌రెడ్డి) బెయిల్‌ పిటిషన్‌ కోర్టులో నడుస్తుందనే చేస్తున్నారు. నా తండ్రిని చెయ్యని తప్పుకి రెండున్నరేళ్లు జైల్లో ఉంచారు. ఆయనకు బెయిల్‌ రాకుండా ఉండేందుకే కట్టుకథలు అల్లుతున్నారు. ఒకవేళ వాళ్లు అనుకున్నట్లు బెయిల్‌ తిరస్కరణకు గురైతే.. మళ్లీ నాలుగైదు నెలలు ఇలాంటివి ఏమీ ఉండవు.. 

దస్తగిరి అప్రూవర్‌గా మారడంలోనూ కుట్ర దాగుంది. హత్య జరిగిన తర్వాత డాక్యుమెంట్స్‌ కోసం వెతికామని దస్తగిరి చెబుతున్నాడు. ఆ టైంలో ఎవరైనా పారిపోవాలని చూస్తారుగానీ.. డాక్యుమెంట్స్‌ కోసం వెతుకుతారా?. వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా కిందపడి రక్తపు వాంతులతోనే వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారు. హత్య తరువాత మీడియా ఎదుట మాట్లాడింది మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.

హత్య జరిగిన నాడు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సాప్‌లో యాక్టీవ్‌గా ఉన్నారని అరోపిస్తున్నారు. అది ఎన్నికల టైం. ఒక ఎంపీగా ఆయనకు సవాలక్ష మెసేజ్‌లు వచ్చి ఉంటాయి. మరి అంతకు ముందెప్పుడు ఆయన అలా వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నారో? లేదో? చూడండి. ఈ విషయాలన్నింటి గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. అసలు కేసు నిష్పక్షపాతంగా జరగడం లేదని వివేకా కూతురు సునీత ఎందుకు ప్రశ్నించరు?.

‘‘నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. అక్కడ ఉండేవాళ్ల ఆరోగ్య పరీక్షల నిమిత్తమే వెళ్లా. నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. పైగా జైల్లో ప్రతీ చోటా సీసీ కెమెరాలు ఉంటాయి. క్యాంపులో నాతో పాటు జైలు అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది కూడా ఉంటారు. అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే.. సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండే వాడిని కదా!. మూడు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటి?.. అని చైతన్య పశ్నించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)