Breaking News

లోక్‌సభ ఎన్నికల బరిలో ‘కెప్టెన్‌’ విజయ్‌ కాంత్‌ కుమారుడు

Published on Sat, 03/23/2024 - 09:52

చెన్నై, తమిళనాడు : డీఎండీకే అధినేత, దివంగత నటుడు విజయ్‌కాంత్‌ తనయుడు వి.విజయ్‌ ప్రభాకర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడియన్ లీగ్ (డీఎండీకే) పార్టీ, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేల మధ్య పొత్తు కుదిరింది. అలయన్స్‌లో భాగంగా విజయ్‌ ప్రభాకర్‌ విరుధ్‌ నగర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి ప్రముఖ నటి రాధికా శరత్‌ కుమార్‌ బీజేపీ తరుపున టికెట్‌ దక్కించుకున్నారు. డీఎంకే - ఇండియా అలయన్స్‌ మాత్రం అభ్యర్ధిని ప్రకటించలేదు. 

ప్రత్యక్ష రాజకీయాల్లోకి కెప్టెన్‌ కుమారుడు
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే విడుదల చేసిన 16 మంది లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ కొడుకు విజయ్‌ ప్రభాకర్‌ పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా డీఎండీకే జనరల్‌ సెక్రటరీ, విజయ్‌ కాంత్‌ సతీమణి ప్రేమలత మాట్లాడుతూ.. తన కుమారు విజయ్‌కి రాజకీయాల పట్ల నిబద్ధత, ఇష్టం ఉన్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తెలిపారు. 
   
ఏఐఏడీఎంకే మేనిఫెస్టో విడుదల 
ఏఐఏడీఎంకే పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. వాటిల్లో డీఎండీకే, సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, పుతియా తమిజగం నేతృత్వంలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోని సైతం విడుదల చేసింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)