Breaking News

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అతి పెద్ద ద్రోహం

Published on Fri, 09/13/2024 - 05:26

విశాఖ సిటీ :   ‘భయపడినంతా అయింది. చంద్రబా­బు హయాంలో వైజాగ్‌ స్టీల్‌ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌–3ను నిలి­పివేయడం స్టీల్‌ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతుకోయడమే. తెలుగు జాతికిది అతిపెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు ఇచి్చన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి’.. అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. 

ఆయన ఇంకా ఏం పేర్కొన్నారంటే.. కేంద్రంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నా.. స్టీల్‌ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. టీడీపీ నాయకత్వంలో కూట­మి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాక­ట్టు పెట్టింది. ఏమాత్రం పట్టింపు ఉన్నా.. చంద్ర­బాబు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసం­హరించుకోవాలి. జగన్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్‌ స్టీల్‌ను కంటికి రెప్పలా కాపాడారు. 

మూత వేయడమే పరిష్కారం కాదని ఆయన అనేకసార్లు చెప్పారు. స్టీల్‌ ఫ్యాక్టరీని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలోగానీ, ఎన్‌ఎండీసీలో గానీ విలీనంచేసి, ఇనుప ఖనిజ గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చని సూచించారు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు, ఆయన వైఖరే కారణం అనడంలో సందేహంలేదు. విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ రాజీనామా చేసి పోరాటానికి సిద్ధంకావాలి.

ఉత్తరాంధ్ర తలను నరకడంగా భావించే ఈ దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి. చంద్రబాబు ప్రజా సంపదను అమ్మకానికి పెడుతుంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర­వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి విశాఖ స్టీల్‌ను రక్షించే దాకా పోరాటం సాగిస్తుంది. వైజాగ్‌ స్టీల్‌ అనే­ది రాష్ట్ర ప్రజల ఉద్వేగాలు, ఆత్మగౌరవంతో ముడిపడినది. ఇప్పుడు పోరాడకపోతే వైజాగ్‌ స్టీల్‌ అనే రాష్ట్ర గౌరవ చిహ్నం శాశ్వతంగా కనుమరుగైపోతుంది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)