తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

Published on Thu, 01/29/2026 - 19:51

సాక్షి,చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ తన పాత వైభవాన్ని తిరిగి పొందాలని ఆకాంక్షించారు.

తమిళనాడు తిరువాయూర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎస్‌.ఏ. చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్‌తో పొత్తు సాధ్యమని, విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం ద్వారా కొత్త చర్చలు మొదలయ్యాయి. టీవీకే పొత్తు ప్రతిపాదనను పరిశీలిస్తోందని, ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా అంగీకరించాలని ఆయన కోరారు.

కాంగ్రెస్‌కు ఒక చరిత్ర, వారసత్వం ఉంది. విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చి వారి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. కాంగ్రెస్ రాజకీయ ప్రాబల్యం కోసం పోరాడుతోంది. వారి ప్రాభవం తగ్గుతుంటే రక్షించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారు’ అని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అటు టీవీకే అధికార ప్రతినిధులు కానీ.. ఇటు విజయ్‌ కానీ ధృవీకరించరించలేదు. ఖండించలేదు.

అయితే, చంద్రశేఖర్ ప్రతిపాదనను తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై తోసిపుచ్చారు. ‘మా పార్టీ కార్యకర్తలకు విజయ్ నుండి ఎలాంటి ఉత్తేజం అవసరం లేదు. మా కార్యకర్తలను చూడండి, వాళ్లలోనే ఉత్తేజం కనబడుతోంది. మా నాయకుడు రాహుల్ గాంధీ మాకు అవసరమైన ‘బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌విటా’ ఇస్తున్నారు’ అని ఆయన స్పష్టం చేశారు.

Videos

యమపాశంగా మారిన ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే

బాబు వెన్నులో వణుకు పుట్టేలా సచివాలయ ఉద్యోగుల మాస్ వార్నింగ్

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)