Breaking News

కాషాయ కండువా కప్పుకోనున్న వీరశివా !

Published on Fri, 03/06/2026 - 10:44

సాక్షి ప్రతినిధి, కడప: మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి బీజేపీలో చేరికకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలుగుదేశం, బీజేపీలోని ఒక సెక్షన్‌ నేతలు వీరశివా బీజేపీ చేరికకు మోకాలొడ్డారు. ఎట్టకేలకు అడ్డంకులన్నీ అధిగమించి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరోమారు పార్టీ ఫిరాయింపునకు తెర లేపారు. బీజేపీలో చేరిక వ్యవహారం గత కొంత కాలంగా ఊగిసలాటలో ఉండిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ మొగ్గు చూపగా, తెలుగుదేశం, బీజేపీ నేతలు కొంతమంది ఇప్పుడు ఆయన అవసరం ఏమిటంటూ అడ్డుతగిలారు. అధికారం కోసమే బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. అన్నీ అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.  

పుత్తాకు పక్కలో బల్లెం... 
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పక్కలో బల్లెం కానున్నారా...అంటే విశ్లేషకులు అవును అని వెల్లడిస్తున్నారు. బీజేపీలో చేరకముండే కమలాపురం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణా వ్యవహారంపై స్పందించారు. కోట్లాది రూపాయాల దోపిడీ వ్యవహారం బహిర్గతం చేశారు. పుత్తా కుటుంబానికి నిత్యం రూ.30లక్షలు అక్రమ ఆదాయం లభిస్తోందని మీడియా సమావేశాలల్లో వ్యాఖ్యనించారు. అదే విషయమై చట్ట పరమైన చర్యలకు సిద్ధమైయ్యారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు అన్నీ రకాల ఎత్తుగడలు అవలంభిస్తున్నారు. ఈపరిస్థితులల్లో బీజేపీలో చేరిన తర్వాత మరింత దూకుడు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనుచరగణాన్ని సమీకరించుకున్న తర్వాత వేగంగా రాజకీయ పావులు కదపనున్నట్లు సమాచారం.    

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)