Breaking News

వరుణ్‌కు నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలెందుకు?

Published on Thu, 03/21/2024 - 07:41

బీజేపీ నేత, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి పోటీ చేయనున్నారా? దీనికి ప్రస్తుతానికి ఎవరి వద్దా సమాధానం లేదు. అయితే ఆయన తాజాగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన వరుణ్ గాంధీ ప్రతినిధులు యూపీలోని పిలిభిత్‌లో నాలుగు సెట్ల నామినేషన్ ఫారాలను కొనుగోలు చేసి, తిరిగి ఢిల్లీకి వెళ్లినట్లు మీడియాకు సమాచారం అందింది. మరోవైపు వరుణ్ గాంధీ పిలిభిత్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తాంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన అధికార ప్రతినిధి వీటిని ఖండించారు.

వరుణ్‌ గాంధీ ఆదేశాల మేరకు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను కొనుగోలు చేశామని, అందులో రెండు హిందీ, రెండు సెట్లు ఇంగ్లీషు భాషలో ఉన్నాయని ఆయన ప్రతినిధి ఎంఆర్ మాలిక్ తెలిపారు. ఈసారి వరుణ్‌ గాంధీసీటు మారుతున్నదన్న ఊహాగానాలకు తెరదించుతూ ఈ స్థానం నుంచి వరుణ్‌ గాంధీనే బీజేపీ అభ్యర్థి అని మాలిక్‌ స్పష్టం చేశారు.

వరుణ్‌ గాంధీ గత కొన్నేళ్లుగా తన సొంత పార్టీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ మధ్యనే ఆయన బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. అలాగే  ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. కాగా పిలిభిత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ ఇంకా ప్రకటించనేలేదు. ఏప్రిల్ 19న పిలిభిత్‌లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది. బుధవారం నుంచే ఇక్కడ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదీఏమైనప్పటికీ వరుణ్‌ గాంధీ నాలుగు నామినేషన్‌ పత్రాలు కొనుగోలు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)