Breaking News

జూ.ఎన్టీఆర్‌ను టీడీపీలోకి లోకేశ్‌ ఆహ్వానించడం పెద్ద జోక్‌

Published on Sun, 02/26/2023 - 03:23

గన్నవరం: ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో కలిసి పనిచేద్దామని జూనియర్‌ ఎన్టీఆర్‌ను లోకేశ్‌  ఆహ్వానించడం అతి పెద్ద జోక్‌ అని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అన్నారు. నందమూరి వంశీకుల పార్టీలోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఆహ్వానించడం అంటే అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు తాత అని, లోకేశ్‌ తాత ఖర్జూర నాయుడని చెప్పారు. 2009 ఎన్నికల్లో లోకేశ్‌ గాలికి తిరుగుతున్నప్పుడే జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ కోసం ప్రాణాలొడ్డి పనిచేశారని గుర్తుచేశారు. అటువంటి ఎన్టీఆర్‌కు ఎవరి దయ అవసరం లేదన్నారు. 

చంద్రబాబు వ్యాఖ్యలకు ఖండన 
గన్నవరం పాకిస్తాన్‌లో ఉందా.. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలను వంశీ తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎవరైనా, ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్లొచ్చని, సెక్షన్‌ 144 అమలులో ఉన్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎవరినైనా నియంత్రించొచ్చని గుర్తుచేశారు.

ముద్రగడ పద్మనాభంను మూడేళ్లు ఇంటి నుంచి బయటకు రాకుండా, మంద కృష్ణమాదిగను ఐదేళ్లపాటు రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు ఏ చట్టం, ఏ రాజ్యాంగం ప్రకారం అడ్డుకున్నారో చెప్పాలన్నారు.  తనను పశువుల డాక్టర్‌ అని హేళన చేస్తున్న చంద్రబాబు ఏమైనా ఆర్‌ఈసీ వరంగల్‌లో, లోకేశ్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారా.. అని ప్రశ్నించారు.  

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)