బాబూ.. అమరావతికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు

Published on Fri, 11/01/2024 - 16:14

సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా?.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా చంద్రబాబు అని ప్రశ్నించారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. అమరావతికి ఔటర్‌ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం అని ఘాటు కామెంట్స్‌ చేశారు.

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2014-19లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు తన మనసులోని కొన్ని అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పులేమీ రాలేదు. చంద్రబాబు చెప్పిన పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాల్సిందే. చంద్రబాబు, పవన్.. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి.

ఔటర్‌ రింగ్ రోడ్డు కారణంగా హైదరాబాద్ డెవలప్ కాలేదు.. ఐటీ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. అమరావతికి ఔటర్‌ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. మేం నెత్తీ నోరూ మొత్తుకున్నా వినకుండా 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 33వేల ఎకరాలు తీసుకుని ఏం లాభం.. అక్కడ ముళ్ల చెట్లు పెరిగాయి. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి ఆ పొలాల్లోని చెట్లను తొలగిస్తున్నారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం. చంద్రబాబు తక్షణమే ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని ఐరన్ ఓర్ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించాలి. ముందు రాష్ట్రం చేయాల్సిన పని చేస్తే.. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చు.

విజయవాడ-విశాఖ మధ్య మెట్రో రైల్ వేస్తానని హడావుడి చేశాడు.. కానీ జరిగిందేమీ లేదు. అమెరికాలో కూడా లేని హైపర్ లూప్ రైలును తెస్తానని ప్రకటించడం చూస్తే నవ్వొస్తోంది. చెన్నై-బెంగుళూరు-హైదరాబాద్-అమరావతిని కలిపి బుల్లెట్ రైలు వేయాలంటున్నాడు. నాది కాకపోతే ఢిల్లీ దాకా దొర్లాలనీ వెనకటికి ఎవడో చెప్పినట్లుంది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు ఇలాంటి అనవరమైన ఆలోచనలను మానుకోవాలని కోరుతున్నాను.  

ఐకానిక్ హైకోర్టు బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన విరమించుకోండి. అలాగే, అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా?. ఐకానిక్ భవనాలకు బదులు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి. ఉచిత ఇసుక అన్నావ్.. ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో మీకూ రిపోర్టులు వస్తున్నాయ్‌ ఒక్కసారి పరిశీలించండి. అవినీతి చేస్తే ఎన్టీఆర్ మంత్రులను కూడా సహించలేదు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే రెండోసారి తప్పులు జరగవు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)