Breaking News

‘బీఆర్‌ఎస్‌ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం’

Published on Sat, 01/03/2026 - 15:38

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌పై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన మంత్రి.. పాలమూరులో బీఆర్‌ఎస్‌ తట్టేడు మట్టి ఎత్తి పోయలేదని మండిపడ్డారు. వచ్చే మూడేళల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న ఉత్తమ్‌.. పాలమూరు ప్రాజెక్ట్ తరవాత కాళేశ్వరం మొదలైనా ఇప్పటికీ పాలమూరు పూర్తి కాలేదన్నారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశారు.. పాలమూరు కు కేవలం 27వేల కోట్లు మాత్రమే. కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చాయి. పాలమూరకు ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదు. పాలమూరు ప్రాజెక్టును కావాలనే బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం చేసింది బీఆర్‌ఎస్‌ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదు. కేసీఆర్‌.. కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే  తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని మేం ఖండిస్తున్నాం’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘కృష్ణా నీటిలో చుక్క నీరు వదులుకోం. తెలంగాణ హక్కులను కాపాడటంతో రాజీపడం. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సంతకాలు చేశారు. తెలంగాణకు బీఆర్‌ఎస్‌ తీవ్ర అన్యాయం చేసింది. తెలంగాణకు 34 శాతం నీళ్లు చాలు అని కేసీఆర్, హరీష్‌రావు సంతకాలు చేశారు. కేసీఆర్ తను ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్పారు. కూర్చువేసుకొని దేవరకద్ర ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.. కానీ ఇప్పటికీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 24 వేల కోట్ల బడ్జెట్ల ఇరిగేషన్‌కు కేటాయిస్తే అందులో 16 వేల కోట్లు ఇంట్రెస్ట్‌కే వెళ్లాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ను 2నుంచి 3టీఎంసీ లకు పెంచారు... పాలమూరు ప్రాజెక్టును 1.5 నుంచి 1టీఎంసీకి పంపారు’’ అని ఉత్తమ్‌ చెప్పుకొచ్చారు.

 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు