Breaking News

మేం మాట నిలబెట్టుకున్నాం

Published on Thu, 08/31/2023 - 03:10

సాక్షి, హైదరాబాద్‌: అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభు త్వాలు ప్రజలకు ఇచ్చిన హా మీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని, అదే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు అందుబాటులో తెచ్చి చరిత్ర సృష్టిస్తోందని నల్లగొండ ఎంపీ కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో బుధవారం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా గాందీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీనేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, బొల్లు కిషన్, నగేశ్‌ముదిరాజ్‌ తదితరులతో కలిసి ఆయన మాట్లా డారు. ‘రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ 99 హామీలిచ్చి ఇప్పటివరకు 9 మాత్రమే నెరవేర్చింది. రుణమాఫీ నుంచి నిరుద్యోగ భృతి వరకు ఏ హామీని అమలు చేయలేకపోయింది.

ఇక, బీజేపీ ఇచ్చిన హామీలకు దిక్కూదివానం లేకుండా పోయింది. కర్ణాటక ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఐదు హామీలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రెండు నెలలు తిరగకముందే నాలుగింటిని అమలుపరచింది.’అని చెప్పారు. తెలంగాణలోనూ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్‌ పార్టీ నెరవేరుస్తుందని చెప్పారు. 

అహంకారమే గద్దె దించుతుంది 
అహంకారమే బీఆర్‌ఎస్‌కు ప్రధాన శత్రువని, ఆ అహంకారమే వారిని గద్దె దించబోతుందని ఉత్తమ్‌ చెప్పారు. సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వడాన్ని బట్టి కేసీఆర్‌ తన ఎమ్మెల్యేల అవినీతికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు ఉందన్నారు. తాను హుజూర్‌నగర్‌లో, తన భార్య పద్మ కోదాడలో పోటీ చేస్తారని, ఏదైనా ఏఐసీసీ నిబంధనలు, ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కు అనుగుణంగానే తమ పోటీ ఉంటుందని చెప్పారు. ఇద్దరికీ 50 వేల మెజారిటీ కంటే తక్కువ వస్తే.. రాజకీయాలను వదిలేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)