Breaking News

నిరుద్యోగభృతి ఇచ్చాకే  కేసీఆర్‌ ఓట్లు అడగాలి

Published on Sun, 08/27/2023 - 03:29

హుజూర్‌నగర్‌: రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్‌ ఓట్లు అడగాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 డిసెంబర్‌ నుంచి నిరుద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ.3 వేల చొప్పున బాకీ ఉన్నదని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పి ఇంతవరకు పట్టించుకోకుండా కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు

గత ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని, మరో పెద్ద సామాజికవర్గం ముదిరాజ్‌లకు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, ముస్లింలకు మూడు సీట్లు ఇచ్చినా వాటిలో రెండు ఓడిపోయే సీట్లేనని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు కలిసిపోయాయని, ఢిల్లీలోని బీజేపీని ఇంటికి పంపాలంటే బీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 70 పైచిలుకు స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్, కోదాడలలో 50 వేల ఓట్ల మెజారీ్టతో గెలవబోతున్నామని ఆయన తెలిపారు.
 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)