Breaking News

కాంగ్రెస్‌, బీజేపీలతో ‘రెండున్నర అక్షరాల పార్టీ’ పోరు!

Published on Mon, 04/01/2024 - 08:04

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి కొససాగుతోంది. ఈ నేపధ్యంలో పలు వింతలు, విడ్డూరాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీకిదిగే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల గురించి అందరికీ ఎంతోకొంత తెలిసేవుంటుంది. అయితే ఎవరికీ అంతగా తెలియని ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఆ పార్టీ పేరు ‘ఢాయీ అక్షర్‌’ అంటే రెండున్నర అక్షరాలు. ఇంతకీ ఈ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తోంది?

భక్త కబీర్‌ ఒక శ్లోకంలో ఢాయీ అక్షర్‌ అనే పదాన్ని ప్రయోగించారు. ‘శ్రీరాం’ అనే అర్థంతో కబీర్‌ దీనిని ఉపయోగించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన రాకేష్‌ సోంకర్‌ ‘ఢాయీ అక్షర్‌’ పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆయన రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జబల్‌పూర్ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్‌​ కూడా దాఖలు చేశారు. ఆయన స్థాపించిన ‘రెండున్నర అక్షరాల పార్టీ’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లతో తలపడనుంది.  కాగా రాకేష్‌  13వ సారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు  ఆయన ఆరు అసెంబ్లీ, ఐదు లోక్ సభ, ఒక మేయర్ ఎన్నికల్లో పోటీ చేశారు. 

ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన రాకేష్ సోంకర్‌కు ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించింది. అందుకే ఆయన ఇటీవల ఆటోడ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఆయన ఎన్నికల ఫిలాసఫీ కూడా ఎంతో విచిత్రంగానే ఉంది.  తాను ఎన్నికలకు ప్రచారం చేయబోనని ఆయన ప్రకటించారు. అయితే ప్రచారం ద్వారా రాకేష్‌ తన అభిప్రాయాలను ఎవరికీ తెలియజేయనప్పుడు ఆయనకు ఓటు వేసేదెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, అందుకే తాను కూడా ఎన్నికల బరిలో దిగానని రాకేష్‌ చెబుతున్నారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)