Breaking News

‘రీజనల్‌’కు రాష్ట్ర నిధులు త్వరగా ఇవ్వండి 

Published on Thu, 01/25/2024 - 04:29

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌: రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. భూసేకరణకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు.

వెంటనే భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు రూ.2,585 కోట్లను జమ చేయాలని.. హైవే నిర్మాణం వేగంగా సాగేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు తెలంగాణలో మరో 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 4,048 హెక్టార్ల భూమిని వెంటనే సేకరించి ఇవ్వాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి బుధవారం రెండు లేఖలు రాశారు. 

ప్రాజెక్టు ఆలస్యమైతే సమస్యలు 
కేంద్రం భారత్‌మాల పరియోజనలో భాగంగా రూ.26 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో హైదరాబాద్‌ నగరం చుట్టూ 350 కిలోమీటర్లకుపైగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను నిర్మి స్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణ వ్యయా న్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుండగా, భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రం చెరో సగం భరించేలా ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,585 కోట్లను వెంటనే ఎన్‌హెచ్‌ఏఐకి జమ చేసి నిర్మాణ పనుల ప్రారంభానికి సహకరించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గతేడాది ఫిబ్రవరి 3న తాను స్వయంగా రాష్ట్ర సర్కారుకు లేఖ రాశానని, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాల అధికారులు కూడా పలుమార్లు లేఖలు రాశారని.. అయినా ఆశించిన స్పందన రాలేదని వివరించారు. రాష్ట్రవాటా నిధుల జమలో ఆలస్యం కారణంగా ప్రాజెక్టు జాప్యమై ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతాయన్నారు.
 
భూసేకరణ త్వరగా చేయండి 
66 ఏళ్లలో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే.. తెలంగాణ ఏర్పాటయ్యాక గత తొమ్మిదిన్నర ఏళ్ల  కాలంలోనే ఎన్డీయే సర్కారు మరో 2,500 కి.మీ జాతీయ రహదారులను నిర్మించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున 11 జాతీ య రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)