Breaking News

సింగరేణి వివాదం.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published on Fri, 06/21/2024 - 15:21

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానిదే కాదని.. కేంద్రానికి బాధ్యత ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం చెప్పిన విషయాలన్నింటిని పరిశీలిస్తాం. ఒడిశాలో గనుల వ్యవహారంపై అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడతాను. దేశమంతా ఒకే పాలసీ వర్తించేలా చొరవ తీసుకుంటాం’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

‘‘సింగరేణికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని రాజకీయం చేయకూడదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సింగరేణిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత సింగరేణికి కేంద్రం ఇస్తోంది. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయి.. ఒడిశా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుంది. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని అధిగమిస్తాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘రెండు, మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తాం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం. ఆక్షన్ అనేది ఓపెన్.. సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు‘‘ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

సింగరేణి వేలం.. కార్మికులకు కిషన్ రెడ్డి భరోసా

 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)